fbpx
HomeMovie Newsమనం కాంబినేషన్ లో 'థాంక్యూ'

మనం కాంబినేషన్ లో ‘థాంక్యూ’

NagaChaitanya VikramKumar MovieLaunch

టాలీవుడ్: అక్కినేని ఫామిలీ కి మరపురాని సూపర్ హిట్ సినిమా ‘మనం’. అక్కినేని నాగేశ్వర్ రావు చివరి సినిమా మాత్రమే కాకుండా ఫామిలీ మొత్తం నటించిన సినిమా. అంతే కాకుండా వాళ్ళ ఫామిలీ నుండి ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమా కూడా ఇదే. ప్రస్తుతం ఇదే కాంబినేషన్ రిపీట్ అవబోతుంది. నాగ చైతన్య ఇరవైయవ సినిమాగా ఈ రోజు షూటింగ్ ప్రారంభం అయింది.విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో నాగ చైతన్య హీరో గా ‘థాంక్యూ’ అనే సినిమా రూపొందించబడుతుంది. ఈ సినిమా గురించి ఇదివరకే రూమర్స్ వినిపించినా కూడా అధికారిక ప్రకటన ఇవాళే విడుదలైంది. నాగ చైతన్య మొదటి సినిమా నిర్మించిన దిల్ రాజు , శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ ద్వారా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

’13 బి’, ‘ఇష్క్’,’మనం’ లాంటి స్టైలిష్ ఎంటర్టైనర్ లు తీసిన విక్రమ్ సినిమా లాగే ఇది కూడా ఒక స్టైలిష్ ఎంటర్టైనర్ లా ఉండబోతుందని అనిపిస్తుంది. ఈ సినిమాని 2021 లో విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాని నేషనల్ అవార్డు విన్నర్ పి సి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. బి వీ ఎస్ రవి కథతో రూపొందుతున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular