fbpx
Friday, April 26, 2024
HomeMovie News'కొండ పొలం' - ఓబుళమ్మ గా రకుల్

‘కొండ పొలం’ – ఓబుళమ్మ గా రకుల్

RakulFirstLook Kondapolam Movie

టాలీవుడ్: ‘ఉప్పెన’ సినిమాతో మెగా కుటుంబం నుండి పరిచయం అయిన నటుడు వైష్ణవ తేజ్. మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ సాధించిన ఈ హీరో మొదటి సినిమా విడుదల అవకముందే రెండవ సినిమా పూర్తి చేసాడు. టాలీవుడ్ లో కథల పరంగా విలువల పరంగా కంటెంట్ ని ప్రెసెంట్ చేయగల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తన రెండవ సినిమాలో నటించాడు. మొన్ననే ‘కొండ పొలం’ అనే టైటిల్ తో పాటు హీరో వైష్ణవ తేజ్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ రోజు ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లుక్ ని కూడా రిలీజ్ చేసారు.

ఈ సినిమాలో వైష్ణవ తేజ్ ప్రేయసి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ఓబుళమ్మ పాత్రలో రకుల్ కనిపించనుంది. ఈ పాత్రకి సంబంధించి ఒక చిన్న వీడియో కూడా విడుదల చేసారు. అడవిలో ప్రేమించుకుంటున్న ఈ జంటని ఆ వీడియో లో చూపించారు. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు కృష్ణ. ఎం.ఎం.కీరవాణి సంగీతం లో ఈ సినిమా రూపొందింది. ఫస్ట్ ఫ్రెమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి మరియు సాయి బాబు జాగర్లమూడి ఈ సినిమాని నిర్మించారు. అక్టోబర్ 8 న ఈ సినిమా థియేటర్ లలో విడుదల అవనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular