fbpx
Saturday, May 4, 2024
HomeMovie Newsదీపావళి కే సూపర్ స్టార్ సినిమా

దీపావళి కే సూపర్ స్టార్ సినిమా

Rajinikanth Annathe ReleaseDate

కోలీవుడ్: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తెలియని వారుండరు. చివరగా మురుగ దాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమాలో నటించారు. ప్రస్తుతం రజిని కాంత్ శివ దర్శకత్వంలో ‘అన్నాథే’ అనే సినిమాలో నటిస్తున్నాడు. సెకండ్ వేవ్ కన్నా ముందే రజిని తన షూట్ పార్ట్ పూర్తి చేసేసాడు. ఈ సినిమాలో రజిని సరసన నయనతార నటిస్తుంది. శివాజీ సినిమాలో ఉన్న స్పెషల్ సాంగ్ తో కలిపి నయనతార కి రజిని తో ఇది నాల్గవ సినిమా. మరొక స్పెషల్ పాత్రలో మహానటి కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో నటించనుంది. ఈ సినిమా ని ఒక పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించారు డైరెక్టర్ శివ.

సినిమా ని మొదటి నుండి ఈ సంవత్సరం దీపావళి కే విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు మేకర్స్. మధ్యలో కరోనా వచ్చి పరిస్థితులు మారిపోవడం తో విడుదల తేదీ మారచ్చు అనుకున్నారు. కానీ ఈ సినిమా మేకర్స్ సినిమా దీపావళి కే విడుదల అవనుందని ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 4 న ఈ సినిమా థియేటర్ లలో విడుదల అవనుందని రజిని కాంత్ బ్యాక్ లుక్ లో ఒక పోస్టర్ విడుదల చేసి ప్రకటించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కాలానిథి మారన్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో మరిన్ని పాత్రల్లో కుష్బూ, మీనా, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, కమెడియన్స్ సూరి, సతీష్ నటిస్తున్నారు. ఈ సినిమాతో ఇమాన్ మొదటిసారి రజిని కాంత్ సినిమా కి పని చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular