fbpx
Friday, April 26, 2024
HomeMovie NewsRRR - దేశభక్తి సినిమా కాదు

RRR – దేశభక్తి సినిమా కాదు

Rajamouli RRRisNotA PatritoticMovie

టాలీవుడ్: RRR సినిమాకి సంబందిచిన క్రేజ్ మామూలుగా లేదు. ఈ సినిమా గురించి ఒక్క అప్డేట్ వచ్చిన కూడా నిమిషాల్లో వైరల్ అవుతుంది. మొన్న రాజమౌళి పుట్టిన రోజు సందర్భం గా ఆ సినిమా టీం సినిమాకి సంబందించిన ఒక పోస్టర్ విడుదల చేసింది. ఆ పోస్టర్ లో రెండు చేతులు కలిసినట్టు ఉంటుంది. అయితే బాగ్ గ్రౌండ్ లో ఉన్న చక్రం మన భారత జాతీయ జండా లోని అశోక చక్రాన్ని పోలి ఉంది. అయితే ఈ పోస్టర్ పై సోషల్ మీడియాలో ‘అల్లూరి సీతారామరాజు మరియు కొమరం భీం కలిసి భారత స్వాతంత్య్రం కోసం కలిసి పోరాడినందుకు ప్రతీకగా ఈ పోస్టర్ ఉంది’ అని ఒక కామెంట్ వచ్చింది. దీనికి ఈ సినిమా టీం రిప్లై ఇచ్చి అసలు విషయం స్పష్టంగా చెప్పింది.

‘ఈ సినిమా స్వాంత్య్రం ముందు జరిగినట్టే రూపొందిస్తున్నాం, మీరు చెప్పినట్టు వాళ్ళు కలిసి పోరాడుతారు కానీ మీరు అనుకున్నట్టు అది స్వాతంత్య్ర పోరాటం కాదు. ఇది ఒక కల్పిత కథ కానీ దేశభక్తి కథ కాదు’ అని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇదిలా ఉండగా ఈ మద్యే షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టిన సినిమా టీం కొద్దీ రోజుల్లో ఎన్టీఆర్ కి సంబందించిన టీజర్ విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. అలాగే ఈ సినిమాని త్వరగా ముగించేసి వచ్చే వేసవి కల్లా సిద్ధం చెయ్యాలని చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular