fbpx
HomeMovie Newsమొదలైన ప్రభాస్-నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ మూవీ

మొదలైన ప్రభాస్-నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ మూవీ

Prabhas NagAshwin ShootStart

టాలీవుడ్: బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజ్ హీరో గా అవతరించిన ప్రభాస్ బాలీవుడ్ హీరోల్ని మించి పాపులారిటీ, స్టార్ డమ్ తో ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ తో ఒక సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ లో దూసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ రోజు నుండి ఈ సినిమా షూటింగ్ మొదలైంది. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో 50 ఏళ్లుగా జైత్ర యాత్ర కొనసాగిస్తున్న వైజయంతి మూవీస్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తుంది.

అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె లాంటి బాలీవుడ్ స్టార్ కాస్ట్ తో పాటు టాప్ టెక్నీషియన్స్ తో భారీ కాన్వాస్ తో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాని 400 నుండి 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. ఈ రోజు నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. గురు పౌర్ణిమ సందర్భంగా ఇండియన్ సినిమాకి గురువు లాంటి అమితాబ్ బచ్చన్ గారి పైన క్లాప్ కొట్టి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టినందుకు ఆనందంగా ఉందని ప్రభాస్ తెలిపారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని ‘ప్రాజెక్ట్ K ‘ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తున్నారు. మరి ఈ K ఏంటి అనేది ముందు ముందు తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ ఫినిషింగ్ షూట్ లో, ఆది పురుష్ మరియు సాలార్ షూటింగుల్లో బిజీ గా ఉన్నారు. ఈ సినిమా ప్రారంభించడం తో ఒకే సారి ప్రభాస్ నటిస్తున్న నాలుగు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. ఇవి డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నాయి. 2022 -23 లో ఎంత కాదన్నా ప్రభాస్ నుండి నాలుగు సినిమాలు రానున్నాయి. ఇన్ని రోజులు ప్రభాస్ సినిమాల కోసం ఎదురుచూసిన డార్లింగ్స్ కి ఒకే సారి పెద్ద గిఫ్ట్స్ ఇవ్వనున్నాడు ప్రభాస్.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular