fbpx
HomeMovie Newsపవన్ కళ్యాణ్ విడుదల చేసిన 'శశి' ట్రైలర్

పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ‘శశి’ ట్రైలర్

PawanKalyanReleased AadiStarrer ShashiMovieTrailer

టాలీవుడ్: తన కంఠం తోనే పాత్రలకి ఊపిరి పోయగల సాయి కుమార్ ఫామిలీ నుండి వారసుడిగా వచ్చిన ఆది ‘ప్రేమ కావాలి’, ‘లవ్లీ’ లాంటి సినిమాలు హిట్ అనిపించుకున్న తర్వాత మళ్ళీ ఒక్క సినిమా కూడా సక్సెస్ సాధించలేకపోయారు. కొంత గ్యాప్ తీసుకుని ప్రస్తుతం ‘శశి’ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ద్వారా టీజర్ విడుదల చేయించిన ఈ సినిమా టీం, ట్రైలర్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులమీదుగా విడుదల చేయించింది. లాక్ డౌన్ కారణంగా చాలారోజులు ఆలస్యం అయినా ఈ సినిమా మరి కొద్దీ రోజుల్లో విడుదల అవుతుంది.

ఈ సినిమా నుండి సిద్ శ్రీరామ్ పడిన ‘ఒకే ఒక లోకం’ పాట బాగా పాపులర్ అయ్యి ఈ సినిమాకి కూడా కొంత బజ్ తీసుకువచ్చింది. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా ఒక ఫీల్ గుడ్ ఫ్రెండ్షిప్ అండ్ లవ్ స్టోరీ అని అర్ధం అవుతుంది. తనని ఎంతగానో ప్రేమించిన తన ప్రేయసి కొన్ని అనుకోని ప్రమాదాల వలన తాను ఎదురుగా ఉన్నా కూడా తనని గుర్తుపట్టలేని స్థితికి చేరుకుంటుంది. అలాంటి పరిస్థితుల మధ్య హీరో తన ప్రేమని ఎలా గెల్చుకుంటాడు అనేది సినిమా కథ అన్నట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. శ్రీనివాస్ నాయుడు నడికట్ల అనే నూతన దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించాడు. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆర్.పి.వర్మ , సి.రామాంజనేయులు , చింతలపూడి శ్రీనివాస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు నిర్మించారు. మార్చ్ 19 న ఈ సినిమా థియేటర్లలో విడుదల అవనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular