fbpx
HomeMovie Newsఅమ్మాయి మనసుకు హానికరం: శ్రీ సింహ

అమ్మాయి మనసుకు హానికరం: శ్రీ సింహ

2ndLyricc ReleasedFrom TellavaaritheGuruvaramMovie

టాలీవుడ్: సంగీత దర్శకుడు కీరవాణి రెండవ కుమారుడు శ్రీ సింహ ‘మత్తు వదలరా’ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. ఈ నటుడు ప్రస్తుతం ‘తెల్లవారితే గురువారం’ అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా టీజర్, పోస్టర్స్ సినిమా పై బజ్ ని క్రియేట్ చేసాయి. ఈ రోజు ఈ సినిమా నుండి ‘మనసుకి హానికరం అమ్మాయే’ అంటూ సాగే పాటని విడుదల చేసారు.

లవ్ లో ఉండే ప్రేమికుల్లో అమ్మాయిల వల్ల అబ్బాయిలు ఎన్ని రకాల బాధలు పడతారు అనే విషయాన్ని ఈ పాటలో చూపించారు. కృష్ణ వల్లెపు ఈ పాటకి అందించిన సాహిత్యం క్యాచీ గా వుంది. కీరవాణి ఇంకో కుమారుడు కాల భైరవ ఈ సినిమాకి సంగీతం అందించాడు. అచ్చు రాజమణి , పృథ్వీ చంద్ర , కాలభైరవ కలిసి ఈ పాటని ఆలపించారు.

శ్రీ సింహ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో చిత్ర శుక్ల, మిష నారంగ్ నటిస్తున్నారు. మరిన్ని పాత్రల్లో రాజీవ్ కనకాల, సత్య, అజయ్, వైవా హర్ష నటిస్తున్నారు. మొదటి సినిమాలో డాన్స్ కి యాక్టింగ్ కి పెద్దగా స్కోప్ లేకపోవడం తో శ్రీ సింహ ఈ సినిమా ద్వారా తన టాలెంట్ ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వారాహి చలనచిత్రం మరియు సౌఖ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రజని కొర్రెపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మార్చ్ 27 న ఈ సినిమా థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular