fbpx
HomeMovie Newsఆగష్టు 14 న థియేటర్లలో 'పాగల్'

ఆగష్టు 14 న థియేటర్లలో ‘పాగల్’

Paagal Release Announcement

టాలీవుడ్: ‘వెళ్ళిపోమాకే’ అనే చిన్న సినిమాతో హీరో గా పరిచయం అయ్యి ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో కొంత గుర్తింపు తెచ్చుకుని ‘ఫలకనామ దాస్’ అనే సినిమాని సొంత నిర్మాణంలో, సొంత డైరెక్షన్లో, తానే హీరోగా అన్నీ తానే చూసుకుని సినిమాని రూపొందించి ఇండస్ట్రీ లో మాస్ ఇమేజ్ ని పెంచుకుని నెక్స్ట్ లెవెల్ హీరోగా ఎదిగే ప్రయత్నంలో ఉన్నాడు విశ్వక్సేన్. కరోనా కి ముందు నాని నిర్మాణంలో ‘హిట్’ అనే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తో కూడా మరో హిట్ సాధించాడు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై ‘పాగల్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా విడుదలకి సంబందించిన అప్ డేట్ ఈ రోజు విడుదలైంది.

ఈ సినిమాని ఆగష్టు 14 న థియేటర్లలో విడుదలవనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా నుండి టైటిల్ వీడియో సాంగ్ కూడా విడుదల చేసారు. ప్రేమ కోసం అమ్మాయిల వెంట పడుతూ కాలేజ్ లు, కాఫీ షాప్ లు, గుడులు తిరుగుతూ అమ్మాయిని ప్రేమలో పడేయడానికి విశ్వక్సేన్ పడే పాట్లు ఈ పాటలో చూపించారు. చివరకి పెళ్లి కి వెళ్లి అక్కడ పెళ్లి కూతురికి కూడా పువ్వు ఇచ్చి ప్రొపోజ్ చేయడానికి ట్రై చేస్తాడు. ‘అమ్మాయిలో అమ్మని చూస్తాడు.. ఆ ప్రేమని అన్వేషిస్తాడు’ అంటూ సాగే లిరిక్స్ తో హీరో ఎలాంటి ప్రేమ కోసం ప్రయత్నించాడు అని చంద్ర బోస్ రచించగా రామ్ మిరియాల పాటని ఆలపించారు. రధాన్ సంగీతంలో వస్తున్న ఈ సినిమాని నరేష్ కుప్పిలి అనే నూతన దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular