fbpx
Saturday, April 20, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeMovie News'మేస్ట్రో'- వెన్నెల్లో ఆడపిల్ల పాట విడుదల

‘మేస్ట్రో’- వెన్నెల్లో ఆడపిల్ల పాట విడుదల

Nithin Maestro SecondSingle

టాలీవుడ్: ఈ సంవత్సరం ఆరంభం లోనే ‘చెక్’, ‘రంగ్ దే’ సినిమాలతో పలకరించాడు నితిన్. ప్రస్తుతం మరో సినిమాని విడుదలకి సిద్ధం చేసాడు. హిందీ లో ఆయుశ్మాన్ ఖురానా హీరో గా నటించిన ‘అందాదున్’ సినిమాని ‘మేస్ట్రో’ అనే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ దృష్టి లోపం ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుండి ఇప్పటికే ‘ఓ బేబీ’ అనే పాట విడుదలై ఆకట్టుకుంది. ‘రంగ్ దే’ సినిమాతో దేవి శ్రీ ప్రసాద్ తో మ్యూజికల్ గా హిట్ సాధించిన నితిన్ ఈ సినిమాతో మరో మ్యూజికల్ హిట్ దిశగా అడుగులు వేస్తున్నాడు.

ఈ రోజు ఈ సినిమా నుండి ‘వెన్నెల్లో ఆడపిల్ల’ అంటూ సాగే పాటని విడుదల చేసారు. ఈ పాట కూడా వినగానే ఆకట్టుకునేలా ఉంది. ‘భీష్మ‘ సినిమాకి నితిన్ తో పని చేసి మ్యూజికల్ హిట్ అందించిన ‘మహతి స్వర సాగర్’ ఈ సినిమాకి కూడా సంగీతం అందించాడు. ఈ పాటని మరో సంగీత దర్శకుడు స్వీకర్ అగస్తి ఆలపించారు. వేంకటాద్రి ఎక్ష్ప్రెస్స్, ఎక్ష్ప్రెస్స్ రాజా లాంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలని డైరెక్ట్ చేసిన మేర్లపాక గాంధీ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. నితిన్ కి జోడీ గా ఈ సినిమాలో నభ నటేష్ నటిస్తుంది. మరో ముఖ్య పాత్రలో తమన్నా నటిస్తుంది. నితిన్ హోమ్ బ్యానర్ అయిన శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాని ఓటీటీ లో విడుదల చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular