fbpx
HomeMovie Newsనితిన్ 'చెక్' ట్రైలర్ విడుదల

నితిన్ ‘చెక్’ ట్రైలర్ విడుదల

NithinChandrashekarYeleti CheckMovie TrailerReleased

టాలీవుడ్: వైవిధ్య సినిమాలు రూపొందించే డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి ప్రస్తుతం నితిన్ తో కలిసి ‘చెక్’ అనే సినిమా రూపొందించారు. ఈ సినిమా ఫిబ్రవరి 26 న విడుదల అవబోతుంది. ఈరోజు ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ని విడుదల చేసారు. అనుకోకుండానో లేదా నిజంగానే టెర్రరిస్టుగా ముద్ర పడిన ఖైదీ గా నితిన్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. స్వతహాగానే చెస్ బాగా ఆడగలిగే నితిన్ జైలు లో ఒక సీనియర్ ఖైదీ తో చెస్ ఆడుతూ ఉంటాడు. చెస్ లోని పావులతో కంపేర్ చేస్తూ జైలు లో ఒక్కో కారెక్టర్ గురించి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అని సీనియర్ ఖైదీ నితిన్ కి చెప్తూ ఉంటాడు. జైలు నుండే చెస్ కాంపిటీషన్స్ లో నితిన్ పాల్గొంటుంటాడు.

నితిన్ ఎదుర్కొన్న కేసు ని వాదించే లాయర్ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఫ్లాష్ బ్యాక్ లో నితిన్ లవ్ ఇంటరెస్ట్ గా వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ నటించింది. చివరగా నితిన్ ఈ కేసు నుండి ఎలా బయటపడతాడు అనేది డైరెక్టర్ వైవిధ్యంగా చూపించనున్నాడు అనేది ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. ట్రైలర్ లో వినిపించిన డైలాగ్ లు ఆకట్టుకున్నాయి. ట్రైలర్ ద్వారా చంద్ర శేఖర్ యేలేటి మరో సెన్సిబుల్ హిట్ కొట్టనున్నాడని హింట్స్ ఇచ్చారు. కళ్యాణి మాలిక్ బాగ్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా థీమ్ కి తగ్గట్టు ఆకట్టుకుంది. ఇందులో సంపత్, కార్తీక్ రత్నం, సాయి చంద్ మరిన్ని పాత్రల్లో మెప్పించారు. ప్రస్తుతం నితిన్ ఈ సినిమాతో పాటు మార్చ్ చివరి వారం లో కీర్తి సురేష్ తో నటించిన ‘రంగ్ దే’ సినిమాని కూడా విడుదల చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular