fbpx
Monday, April 29, 2024
HomeMovie News'వైల్డ్ డాగ్' పూర్తి చేసిన నాగ్

‘వైల్డ్ డాగ్’ పూర్తి చేసిన నాగ్

Nagarjuna WrappedUp WildDogShooting

టాలీవుడ్: చాలా గ్యాప్ తీసుకొని అక్కినేని నాగార్జున ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘వైల్డ్ డాగ్’. ఇందులో ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రోల్ లో నాగార్జున నటిస్తున్నారు. కోవిడ్ వల్ల షూటింగ్ ఆగిపోయిన ఈ సినిమా రెండు నెలల క్రితమే షూటింగ్ మొదలైంది. ఈ మద్యే ఒక యాక్షన్ సీక్వెన్స్ షూట్ కోసం మనాలి వెళ్లారు. అక్కడే మిగతా భాగం షూట్ పూర్తి చేసి వైల్డ్ డాగ్ లో తన భాగం షూటింగ్ కంప్లీట్ చేసాడు నాగార్జున. స్పెషలిస్ట్ ఆఫీసర్ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున మెప్పించబోతున్నాడు. ఇలాంటి పాత్రల్లో ఇదివరకే గగనం, ఆఫీసర్ లాంటి పాత్రలు చేయగా అందులో ఒకటి సక్సెస్ ఒకటి ఫెయిల్యూర్ గా నిలిచింది. ఈ సినిమా పైన నాగార్జున బాగానే ఆశలు పెట్టుకున్నాడు.

‘వైల్డ్ డాగ్ లో నా భాగం పూర్తి అయింది. నా సినిమా టీం ని, హిమాలయాస్ ని వదిలి వస్తున్నందుకు బాధగా ఉంది’ అని ట్వీట్ చేసాడు నాగ్. ఈ షూట్ పూర్తి చేసి వీకెండ్ బిగ్ బాస్ షూట్ లో జాయిన్ అవుతున్నాడు నాగ్. ఈ సినిమాలో నాగార్జున కి జోడీ గా ఒక ముఖ్య పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా నటిస్తుంది. అలాగే నాగార్జునే టీం లో సయామీ ఖేర్ మరియు బిగ్ బాస్ ఫేమ్ ‘అలీ రెజా’ నటిస్తున్నారు. అహిషోర్ సాల్మోన్ అనే దర్శకుడు ఈ సినిమా ద్వారా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular