fbpx
Tuesday, May 7, 2024
HomeMovie Newsమళయాళ సినిమాకి అమెరికా అవార్డుల పంట

మళయాళ సినిమాకి అమెరికా అవార్డుల పంట

MuthonBags International Awards

మాలీవుడ్: విభిన్నమైన చిత్రాలని, కథా పరమైన చిత్రాలని ఎక్కువగా తీసే ఇండస్ట్రీ గా ఈ మధ్య మలయాళ సినిమా ఇండస్ట్రీ పేరు గాంచింది. ఈమధ్య విడుదలైన ఈ బాషా సినిమాలకి ఓటీటీల్లో అశేష ఆదరణ లభిస్తుంది. ఓటీటీ లో మాత్రమే కాకుండా ఈ సినిమాల రైట్స్ కొనుక్కొని వీటిని రీమేక్ చెయ్యడానికి లైన్ లు కడుతున్నారు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్. అయితే ప్రేమమ్ సినిమాతో నేషనల్ వైడ్ గుర్తింపు పొందిన నివిన్ పౌలీ నటించిన ‘మూతోన్’ సినిమాకి న్యూ యార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించడానికి ఎంపిక అయింది. ప్రదర్శించడమే కాకుండా ఈ సినిమాకి ఏకంగా మూడు అవార్డులు లభించాయి. ఉత్తమ సినిమా, ఉత్తమ హీరో, ఉత్తమ చైల్డ్ ఆక్టర్’ కేటగిరీల్లో ఈ సినిమాకి మూడు అవార్డులు లభించాయి.

నివిన్ పౌలీ నటించిన ‘మూతోన్’ అనే సినిమా 2019 లో విడుడల అయింది. అయితే ఒక సౌత్ ఇండియన్ సినిమాకి ఇన్ని అవార్డులు లభించడం గొప్ప విషయం గా చెప్పుకోవచ్చు. న్యూ యార్క్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమాకి ఉత్తమ నటుడిగా నివిన్ పౌలీ, ఉత్తమ బాల నటిగా బేబీ సంజన కి అవార్డు లభించింది.

1 COMMENT

Leave a Reply to GK Cancel reply

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular