fbpx
HomeMovie Newsమోహన్ లాల్ 'దృశ్యం 2 ' టీజర్

మోహన్ లాల్ ‘దృశ్యం 2 ‘ టీజర్

MohanLal Drishyam2Movie TeaserReleased

మాలీవుడ్: 2014 సంవత్సరం లో మలయాళం లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘దృశ్యం’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఆ తర్వాత ఈ సినిమా తెలుగులో , హిందీలో, తమిళ్ లో ఇలా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. అనుకోకుండా జరిగిన ఒక హత్య నుండి తన కుటుంబాన్ని ఎలా తెలివిగా కాపాడుకున్నాడనేది సినిమా కథ. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా రెండవ భాగం వస్తుంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన టీజర్ విడుదల చేసారు మూవీ టీం. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో డైరెక్ట్ గా విడుదల చేస్తున్నారు.

‘రహస్యాలు ఎన్ని రోజులు దాగుతాయి ఎప్పటికైనా బయట పడాల్సిందే.. కాలాన్ని బట్టి నిజాలు తెలుస్తాయి..’ అనే థీమ్ ని టీజర్ ద్వారా తెలిపారు. మొదటి పార్ట్ లో జరిగిన హత్య కి సంబందించిన ఆధారాలు ఏమైనా బయటపడి మళ్ళీ దాని నుండి తన కుటుంబాన్ని ఎలా కాపాడుతాడో మరోసారి చూపిస్తాడేమో అనే కథనం ఉండొచ్చని టీజర్ ని బట్టి ఒక అంచనా వెయ్యొచ్చు. ఇందులో కూడా మోహన్ లాల్ కి జోడీ గా మీనా నటిస్తుంది. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరుంబవూర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జీతూ జోసెఫ్ ఈ సినిమాని డైరెక్ట్ చేసారు. జనవరి చివర్లో లేదా ఫిబ్రవరి లో ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో అందుబాటులో ఉండవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular