fbpx
HomeMovie Newsదృశ్యం కాంబినేషన్ లో మరో సినిమా

దృశ్యం కాంబినేషన్ లో మరో సినిమా

MohanLal 12tManMovie Announcement

మాలీవుడ్: 2013 లో మలయాళం టాప్ స్టార్ మోహన్ లాల్ హీరో గా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో దృశ్యం అనే థ్రిల్లర్ మూవీ విడుదలైంది. ఈ సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా సౌత్ లోని అన్ని భాషలతో పాటుగా హిందీ లో కూడా రీ-మేక్ అయ్యి విడుదలైన అన్ని చోట్ల సూపర్ హిట్ అయింది. ఇదే కాంబినేషన్ లో మొదటి సినిమాకి కంటిన్యూయెషన్ గా దృశ్యం 2 సినిమా రూపొందింది. ఈ సినిమా ఈ సంవత్సరం ఆరంభం లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదల చేసారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఓటీటీ లో విడుదల అవడం తో దేశ వ్యాప్తంగా ఈ సినిమాని చూసి ఆదరించారు. కేవలం రీజనల్ సినిమా అయినా కూడా ప్రైమ్ వీడియో లో ఈ సినిమాకి ఎక్కువ వ్యూస్ లభించాయి. ఈ సినిమాని వెంకటేష్ హీరో గా తెలుగులో కూడా తెరకెక్కించి విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం మోహన్ లాల్ మరియు జీతూ జోసెఫ్ మరో సినిమా రూపొందించడానికి రంగం సిద్దమయింది. ఈ సినిమా కూడా సస్పెన్స్ థ్రిల్లర్ గా నే రూపొందించనున్నట్టు ప్రకటించారు. ’12th MAN ‘ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందనుంది. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంథోనీ పెరుంబవూరు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఒక ఇంట్లో 11 మంది షాడోస్ ని చూపించి ఆ ఇంట్లోకి బయటనుండి వెళ్తున్న మోహన్ లాల్ షాడో ని చూపించి టైటిల్ కింద ‘అన్ వీలింగ్ ది షాడోస్’ అని ఈ 12 వ మనిషి ఆ నీడలు ఏంటి అనేది చూపించబోతున్నట్టు సింబాలిక్ గా చూపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular