fbpx
HomeLife Style5జీ కోసం ఎల్‌అండ్‌టీ వోడాఫోన్ ఐడియా కీలక ఒప్పందం!

5జీ కోసం ఎల్‌అండ్‌టీ వోడాఫోన్ ఐడియా కీలక ఒప్పందం!

L&T-TIES-WITH-VODAFONEIDEA-FOR-5G-TRIALS

న్యూఢిల్లీ: దేశంలో మొబైల్ నెట్వర్క్ రంగంలో 5జీ సేవలు అందించే విషయంలో పలు మొబైల్‌ నెట్‌వర్క్‌ సంస్థలు చాలా వేగంగా తమ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మొబైల్ కంపెనీల యొక్క ఏజీఆర్‌ బకాయిలపై నాలుగేళ్ల పాటు మారటోరియం విధించడం, టెలికాం రంగంలో 100 శాతం మేర ఎఫ్‌డీఐలను అనుమతి ఇవ్వడంతో టెలికాం కంపెనీలు 5జీ నెట్‌వర్క్‌ స్థాపన కోసం వేగంగా ప్రణాళికలను రచిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో దేశంలో 5జీ నెట్‌వర్క్‌ ట్రయల్స్‌లో భాగంగా వోడాఫోన్‌ ఐడియా (వీఐ) తాజాగా ఎల్‌అండ్‌టీతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 5జీ స్మార్ట్‌ సిటీల్లో భాగంగా ఎల్‌ అండ్‌ టీ, వోడాఫోన్‌ ఐడియా సంయుక్తంగా కలిసి పనిచేయబోతున్నాయి.

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థిగ్స్‌ (ఐవోటీ), వీడియో, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీలతో ఎల్‌అండ్‌టీ స్మార్ట్‌సిటీ ప్లాట్‌ఫాంపై వోడాఫోన్‌ ఐడియా పనిచేయనుంది. ఈ ఒప్పందం సందర్భంగా, వొడాఫోన్ ఐడియా చీఫ్ ఎంటర్‌ప్రైజ్ బిజినెస్ ఆఫీసర్ అభిజిత్ కిషోర్ మాట్లాడుతూ, 5జీ టెక్నాలజీతో పలు పరిష్కారాలను, స్థిరమైన నగరాలను నిర్మించడానికి వెన్నెముక అని చెప్పారు.

5జీ టెక్నాలజీ రాకతో పట్టణాల్లోని సవాళ్లను సులువుగా పరిష్కరించవచ్చునని అన్నారు. ఇప్పటికే వొడాఫోన్ ఐడియా(వీఐ) పూణేలో నిర్వహిస్తున్న 5జీ ట్రయల్స్ సమయంలో 3.7 జీబీపీ వేగంతో డేటాను బదిలీ చేసింది. వోడాఫాన్‌ ఐడియా తన ఓఈఎమ్‌ భాగస్వాములతో కలిసి 3.5 గిగాహెర్జ్ బ్యాండ్ 5ఘ్ ట్రయల్ నెట్‌వర్క్‌ భాగంగా లో 1.5 జీబీపీఎస్ వరకు గరిష్ట డౌన్‌లోడ్ వేగాన్ని సాధించిందని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular