fbpx
Friday, June 2, 2023

INDIA COVID-19 Statistics

44,991,143
Confirmed Cases
Updated on June 2, 2023 6:18 pm
531,874
Deaths
Updated on June 2, 2023 6:18 pm
3,736
ACTIVE CASES
Updated on June 2, 2023 6:18 pm
44,455,533
Recovered
Updated on June 2, 2023 6:18 pm
HomeTelanganaహైదరాబాద్ కు భారీగా నిధులు: కేటీఆర్

హైదరాబాద్ కు భారీగా నిధులు: కేటీఆర్

KTR-SAYS-FUNDS-GIVEN-FOR-HYDERABAD

హైదరాబాద్‌: హైదరాబాద్ నగరానికి ప్రభుత్వం గత ఐదు ఏళ్లుగా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ ప్రగతి నివేదిక గత ఐదు ఏళ్లలో తమ పని తీరుకి నిదర్శనంగా ఉండబోతుందన్నారు.

నగర మంత్రులు, ఎమ్మెల్యేలతో, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్‌ మంగళవారం సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, జిహెచ్ఎంసీ పరిధిలో ఇన్ని రోజులుగా చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత పెద్ద ఎత్తున తీసుకుపోవాలని కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ధరణి పోర్టల్’లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు సంబంధించి ప్రజల్లోకి మరింత సమాచారాన్ని తీసుకుపోవాలని తెలిపారు.

ప్రజల ఆస్తులపైన సంపూర్ణ హక్కులు లేకుండా కొన్ని సమస్యలు ఉన్నాయని హైదరాబాద్ నగరంలో అనేక కారణాలతో కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్లు జరగట్లేదని తెలిపారు. వాటన్నింటినీ సానుకూలంగా పరిశీలించి పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని స్పష్టం చేశారు. ఇలాంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తీసుకువచ్చారని గుర్తుచేశారు. స్థిరాస్తులపైన యాజమాన్య హక్కులు కల్పించేందుకు చేపట్టే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉంటుందని తెలిపారు.

ఇలాంటి ప్రక్రియలో దళారులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కార్పొరేటర్లకు ఆయన సూచించారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్‌ 1వతేదీ నుంచి ప్రారంభం కానున్న ఓటరు నమోదు కార్యక్రమంలో అందరూ పాలుపంచుకోవాలన్నారు. హైదరాబాద్ నగరంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని మరింతగా పెంచేందుకు నగరంలో ఉన్న గ్రాడ్యుయేట్లలను ఓటర్లుగా నమోదు చేయించేందుకు ప్రయత్నం చేయాలని చెప్పారు. అక్టోబర్ 1వ తేదీన ప్రతీ ఒక్కరు తమతో పాటు తమ కుటుంబ సభ్యులను ఓటర్లుగా నమోదు చేయించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular