fbpx
HomeMovie Newsజూన్ 3 న కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి'

జూన్ 3 న కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’

KeerthiSuresh GoodLuckSakhi ReleaseDateAnnounced

టాలీవుడ్: మహానటి అద్భుతమైన విజయం తర్వాత కీర్తి సురేష్ వరుసగా లేడీ ఓరియెంటెడ్ కథలనే ఎంచుకుంటూ ముందుకు వెళ్తుంది. ఆ క్రమం లోనే ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ లాంటి సినిమాల ద్వారా పరాజయం చవి చూసింది. ఇపుడు ‘గుడ్ లక్ సఖి’ అనే మరో సినిమాతో లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ తో మన ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో షూటర్ గా నటించింది కీర్తి. ఒక పల్లెటూర్లో ఉండే ఒక మామూలు అమ్మాయి షూటర్ గా ఎదిగి నేషనల్ మెడల్ ఎలా సాధించింది అనేది సినిమా కథ అన్నట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ఈ రోజు ఈ సినిమా విడుదల తేదీ ని ప్రకటించారు. జూన్ 3 న ఈ సినిమా విడుదల అవనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

జగపతి బాబు ఈ సినిమాలో కోచ్ పాత్రలో నటించనున్నాడు. పల్లె టూర్లో ఉండే కీర్తి సురేష్ టాలెంట్ ని గుర్తించి షూటింగ్ లో తనకి ట్రైనింగ్ ఇచ్చే పాత్రలో జగపతి బాబు నటిస్తున్నాడు. బాడ్ లక్ అమ్మాయిగా గా పిలవబడే కీర్తి సురేష్ ని ప్రేమించే పాత్రలో ఆది నటిస్తున్నాడు. దిల్ రాజు సమర్పణలో వర్త్ షాట్ మోషన్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పడిరి నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకత గా నిలవనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular