fbpx
HomeMovie Newsకమల్ హాసన్ క్లాసిక్ టైటిల్ తో దేవరకొండ బ్రదర్స్ సినిమా

కమల్ హాసన్ క్లాసిక్ టైటిల్ తో దేవరకొండ బ్రదర్స్ సినిమా

AnandDevarakonda PushpakaVimanam FirstLook

టాలీవుడ్: పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాల ద్వారా నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకుని ఇపుడు
‘లైగర్’ లాంటి పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ క్రేజ్ ని పెంచుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ‘దొరసాని’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఈ మధ్యనే ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ అనే సినిమా ద్వారా ఓటీటీ లో డైరెక్ట్ రిలీజ్ చేసి హిట్ కొట్టాడు ఈ హీరో. ప్రస్తుతం ఈ హీరో బ్రదర్స్ కలిసి మరో సినిమా తో మన ముందుకు రానున్నారు. కాకపోతే ఇద్దరు కలిసి నటించడం కాకుండా అన్న నిర్మాణంలో తమ్ముడు హీరోగా నటిస్తున్నాడు.

కింగ్ అఫ్ హిల్ మరియు తంగా ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ దేవరకొండ సమర్పణలో గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దశి, ప్రదీప్ ఎర్రబెల్లి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కమల్ హాసన్ నటించిన, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం లో రూపొందిన మూకి మూవీ ‘పుషక విమానం’ లాంటి క్లాసిక్ టైటిల్ ని ఈ సినిమాకి వాడుతున్నాడు. ఈ రోజు ఈ సినిమా టైటిల్ తో పాటు సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో సీనియర్ కమెడియన్ సునీల్ కూడా నటిస్తునందు. దామోదర అనే దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు. ఒక పూర్తి డార్క్ కామెడీ ఎంటర్టైనర్ ఈ సినిమా రూపొందుతున్నట్టు విజయ్ దేవరకొండ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular