fbpx
HomeMovie Newsసుకుమార్ బ్యానర్ లో మరో చిన్న హీరో సినిమా

సుకుమార్ బ్యానర్ లో మరో చిన్న హీరో సినిమా

Karthikeya MovieUnder SukumarWritings

టాలీవుడ్: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్ స్థాపించి చిన్న సినిమాలు నిర్మిస్తున్నాడు. కుమారి 21f , దర్శకుడు, రీసెంట్ గా ఉప్పెన లాంటి సూపర్ హిట్ సినిమాలని నిర్మించింది ఈ సంస్థ. కేవలం సినిమాలని నిర్మించడమే కాకుండా ఈ బ్యానర్ లపై నిర్మించే సినిమాలకి కథ, కథా సహకారం, రచన సహకారం లాంటివి అందిస్తుంటాడు సుకుమార్. అంతే కాకుండా తన అసిస్టెంట్ డైరెక్టర్స్ ని ఈ బానర్ ద్వారా ప్రోత్సహిస్తుంటాడు సుకుమార్. తాను పెద్ద హీరోలతో ప్రయోగాలు చేయలేని సబ్జక్ట్స్ లాంటివి సెలెక్ట్ చేసుకుంటూ లేదా తాను రాసినవే పెద్ద హీరోలతో చేయలేని రిస్కీ సబ్జక్ట్స్ ని మంచి కథనం తో తన బ్యానర్ ద్వారా రూపొందిస్తుంటాడు సుకుమార్.

ప్రస్తుతం సుకుమార్ తన బ్యానర్ ద్వారా మరో చిన్న హీరో తో సినిమా చేయనున్నాడు. RX100 ద్వారా పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ సాధించిన నటుడు కార్తికేయ. ఆ తర్వాత వరుస ప్లాపులు ఎదుర్కొని ఇపుడు మళ్ళీ మంచి మంచి బ్యానర్ లలో సినిమాలు చేస్తున్నాడు. సుకుమార్ బ్యానర్ లో కార్తికేయ సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇదే కాకుండా గీతా ఆర్ట్స్ వారి బ్యానర్ లో ‘చావు కబురు చల్లగా’ అనే సినిమా చేసిన కార్తికేయ మరో సినిమా కూడా చేయబోతున్నాడని న్యూస్ ఉంది. ప్రస్తుతం సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో సుకుమార్ నిర్మాణంలో రూపొందబోతున్న సినిమాకి సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ అందించనున్నాడు. ఈ సినిమా గురించి మిగతా వివరాలు మరిన్ని రోజుల్లో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమాని రూపొందిస్తున్న సుకుమార్ తరువాత విజయ్ దేవరకొండ తో సినిమాని చేయబోతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular