టాలీవుడ్: ప్రభాస్ స్నేహితులు ప్రమోద్, వంశీ, విక్రమ్ యూవీ క్రియేషన్స్ స్థాపించి వరుసగా పెద్ద సినిమాలు చేస్తున్నారు. వీరు ప్రస్తుతం యూవీ కాన్సెప్ట్స్ అనే అనుబంధ సంస్థ స్థాపించి యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ చిన్న సినిమాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ‘ఏక్ మినీ కథ’ అనే సినిమా రూపొందిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన టీజర్ విడుదలైంది.
పేపర్ బాయ్, తాను నేను లాంటి సినిమాల్లో హీరోగా నటించిన ‘సంతోష్ శోభన్’ హీరోగా యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ‘ఏక్ మినీ కథ’ సినిమా రూపొందించబడింది. ఈ సినిమాలో తనకి ఉన్న ఒక ప్రాబ్లెమ్ ఎవరికీ చెప్పుకోలేక పోతుంటాడు, చివరికి చెప్పుకున్న తర్వాత అవతలి వాల్ల దగ్గరి నుండి వచ్చే రెస్పాన్స్ చూసి ఫ్రస్ట్రేట్ అవుతూ తన చుట్టూ జరిగే సంఘటనలతో తన లోపాన్ని ఎత్తిచూపంచినట్టు అనిపించే కామెడీ సీన్స్ ని జోడించి టీజర్ విడుదల చేసారు. ‘డజ్ సైజ్ మ్యాటర్?’ అనే టాగ్ లైన్ తో రాబోతున్న ఈ సినిమా కొన్ని సార్లు చిన్న విషయాలు పెద్ద సమస్యలు క్రియేట్ చేస్తాయి అనే డైలాగ్ తో టీజర్ ముగించారు.
వేంకటాద్రి ఎక్ష్ప్రెస్స్, ఎక్ష్ప్రెస్స్ రాజా లాంటి సినిమాలని డైరెక్ట్ చేసిన మేర్లపాక గాంధీ ఈ సినిమాకి కథ అందించారు. కార్తీక్ రాపోలు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రద్దా దాస్ తో పాటు బ్రహ్మాజీ, సుదర్శన్, సప్తగిరి, హర్షవర్ధన్ మరిన్ని పాత్రల్లో మెరిశారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మరి కొద్దీ రోజుల్లో విడుదల అవనుంది.