fbpx
HomeMovie Newsఅండర్ వరల్డ్ కథతో రానున్న 'కబ్జ'

అండర్ వరల్డ్ కథతో రానున్న ‘కబ్జ’

Kannada KabjaaMovie LatestPoster

శాండల్ వుడ్: కే.జి.ఎఫ్ సినిమా తర్వాత కన్నడ సినిమా వైపు అందరి దృష్టి పడింది. అక్కడ కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమాలు తియ్యడం మొదలు పెట్టారు. అంతక ముందు కన్నడ ఇండస్ట్రీ పాత సినిమాలని రీమేక్ చేయడం లేదా కథల పరంగా అవుట్ డేటెడ్ ఉండడం తో కన్నడ సినిమాలు వేరే ప్రాంతాల్లో అంతగా ఆదరణకు నోచుకునేవి కావు. కానీ ప్రశాంత్ నీల్ కే.జి.ఎఫ్ సినిమా తర్వాత పరిస్థితి మారింది. ‘రక్షిత్ శెట్టి’ రూపొందించిన ‘అతనే శ్రీమన్నారాయణ’, సుదీప్ హీరోగా రూపొందనున్న ‘విక్రాంత్ రానా’ లాంటి కొన్ని సినిమాలు పాన్ ఇండియా దృష్టి లో పడ్డాయి. ప్రస్తుతం అలాంటి మరొక సినిమాతో వస్తున్నాడు ఉపేంద్ర.

కన్నడ ఇండస్ట్రీ నుండి మొదటి నుండి కొంచెం యూనివర్సల్ గుర్తింపు ఉన్న నటుడు ఉపేంద్ర. ఉపేంద్ర హీరోగా ‘కబ్జ’ అనే సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో మరో అద్భుతమైన పాత్రలో కిచ్చా సుదీప్ కూడా నటించనున్నాడు. ఈ రోజు వీరిద్దరిని కలిపి ఉన్న ఒక పోస్టర్ విడుదల చేసారు. ఎ న్యూ విజన్ అఫ్ అండర్ వరల్డ్ అని టాగ్ చేసి ఈ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమాని 90 ల్లో ఉండే కథ గా రూపొందించారు. అప్పట్లో అండర్ వరల్డ్ విజన్ కి సంబందించిన కథ గా పోస్టర్ లో చూపించిన ఉపేంద్ర, సుదీప్ రెట్రో లుక్స్ ఆకట్టుకున్నాయి. ఆర్. చంద్రు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఒరియా, మరాఠి మరియు హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular