fbpx
HomeMovie Newsమహా సముద్రం: చుంచు మామ ఫస్ట్ లుక్

మహా సముద్రం: చుంచు మామ ఫస్ట్ లుక్

JagapatiBabuLook From MahaaSamudramMovie

టాలీవుడ్: RX100 సినిమా ద్వారా పరిచయం అయ్యి సూపర్ హిట్ సాధించిన డైరెక్టర్ తన రెండవ సినిమాని మల్టీ స్టారర్ గా రూపొందిస్తున్నాడు. ‘మహా సముద్రం’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో శర్వానంద్, సిద్దార్థ్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలో మరో ప్రత్యేక పాత్రలో జగపతి బాబు నటిస్తున్నాడు. ఈ రోజు జగపతి బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో జగపతి బాబు పాత్ర పేరు తో సహా జగపతి బాబు లుక్ ని విడుదల చేసారు. జగపతి బాబు ‘చుంచు మామా’ అనే పేరున్న పాత్రలో ఈ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాతో పాటు జగపతి బాబు ప్రస్తుతం నటిస్తున్న ‘టక్ జగదీశ్’, ‘రిపబ్లిక్’, ‘గుడ్ లక్ సఖి’, ‘లక్ష్య’, ‘లాభం’ అనే సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాల్లోంచి కొన్ని సినిమాలు కూడా జగపతి బాబు లుక్ ని విడుదల చేసి విషెస్ తెలియచేశాయి. లెజెండ్ సినిమా సక్సెస్ తర్వాత జగపతి బాబు గ్రాఫ్ చాల బాగా పెరిగింది. విలన్ పాత్ర అయినా, తండ్రి పాత్ర అయినా ఎలాంటి పాత్ర అయినా తనని తాను మలచుకుంటూ బిజీ గా సినిమాలు చేస్తున్నాడు. జగపతి బాబు ఒక కొత్త రకమైన పాత్ర చేసిన FCUK (ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్) సినిమా ఈరోజే విడుదలయింది. ఈ సినిమాలో జగపతి బాబు పాత్రకి ప్రశంసలు దక్కుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular