fbpx
HomeSportsఐపీఎల్ 2021 హైదరాబాద్ లో జరిగే అవకాశం?

ఐపీఎల్ 2021 హైదరాబాద్ లో జరిగే అవకాశం?

HYDERABAD-ALTERNATE-STADIUM-FOR-MUMBAI-AMID-COVID-CASES

ముంబై: ఐపీఎల్ 14వ సీజన్‌ పనులు మొదలైనప్పటి నుండి హైదరాబాద్ వేదిక‌ గురించి చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ముంబైలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతుండటంతో హైదరాబాద్‌ను వేదికగా నిర్ణయిస్తే బాగుంటుందని బీసీసీఐ పెద్దలు షెడ్యూల్‌ ఖరారు చేసిన సమయంలో ఆలోచన చేసినప్పటికీ దానికి మాత్రం పలు కారణాల వల్ల ముందడుగు పడలేదు.

ఐపీఎల్ 2021 కు వేదికలుగా చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్‌, ఢిల్లీలతో పాటు ముంబైను చివరిగా ఖరారు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కానీ ఆ ఆలోచన అంత మంచి కాదనేది ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి కనిపిస్తోంది. ఇప్పుడు రోజురోజుకు ముంబైలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆటగాళ్లు ఎంత బయో బబుల్‌ నిబంధనలు పాటిస్తున్నప్పటికీ ఒక్కొక్కరిగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు అయిన అక్షర్‌ పటేల్‌కు తాజాగా కరోనా సోకింది. ముంబై స్టేడియం సిబ్బందిలో కూడా 8 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కరోనా పాజటివ్‌గా సోకిన వారందరిని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు. దాంతో కరోనా కలవరం ఇప్పుడు అన్ని ఐపీఎల్‌ ఫ్రాంచైజీల్లో మొదలైంది.

ముంబైలో సీఎస్‌కే, ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌లు తమ ఐపీఎల 2021 సీజన్‌ను ఆరంభించాల్సి ఉంది. ఈ జట్లలోని ఆటగాళ్లు ఎవరూ బయట వ్యక్తులతో ఎటువంటి కాంటాక్ట్‌ లేకుండా కఠినమైన నిబంధనలను పాటిస్తున్నారు. అయినప్పటికీ కరోనా కలవర పరుస్తోంది. దీనిపై బీసీసీఐ తర్జన భర్జన పడుతోంది. వాంఖడే స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణపై బీసీసీఐ పునరాలోచన చేస్తుంది. ముంబైలో మ్యాచ్‌ల నిర్వహణ కష్ట సాధ్యంగా ఉన్న క్రమంలో వేరే వేదికగా కోసం ఆలోచిస్తోంది.

కాగా వేదికల ఆల్టర్నేట్ రేసులో హైదరాబాద్‌ అన్నింటికంటే ముందు వరుసలో ఉంది. తాము ఐపీఎల్‌-2021 నిర్వహణకు సిద్ధంగా ఉన్నమంటూ తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌ గతంలోనే ఓ ప్రకటన విడుదల చేశారు. మరి వారం రోజుల సమయం కూడా అందుబాటులో లేని తరుణంలో ముంబైలోని జరగాల్సిన మ్యాచ్‌లను హైదరాబాద్‌కు మార్చడం కష్టతరమే కావచ్చు.

అయితే అది అంత అసాధ్యమేమీ కాదు. కాగా, అప్పుడు హైదరాబాద్‌ను వద్దనుకున్న బీసీసీఐ పెద్దలకు ఇప్పుడు అదే వేదికలో మ్యాచ్‌ల నిర్వహణ తప్పేలా కనిపించడం లేదు. మరి దీనిపై ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular