fbpx
HomeTelanganaహైదరాబాద్ అబిడ్స్ లో కాల్పుల కలకలం!

హైదరాబాద్ అబిడ్స్ లో కాల్పుల కలకలం!

GUNFIRE-IN-ABIDS-SBI-BANK-BY-SECURITY-GUARD

హైదరాబాద్‌: హైదరాబాద్ లో ఇటీవలే కూకట్‌పల్లి ఏటీఎం వద్ద గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డ సంఘటన మరచిపోక ముందే నగరం‌లో ఇంకో దారుణం జరిగింది. ఈ సారి ఏకంగా అబిడ్స్ ఎస్‌బీఐ బ్యాంక్‌లోనే కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు ఎస్‌బీఐ కాంట్రాక్ట్‌ ఉద్యోగి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న ఎస్‌బీఐ బ్యాంక్‌లో బుధవారం కాల్పులు చోటు చేసుకున్నాయి. అక్కడ పని చేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగి సురేందర్‌పై సెక్యూరిటీ గార్డ్‌ సర్దార్‌ ఖాన్‌ కాల్పులు జరిపాడు. ఆయన దగ్గరున్న సెక్యూరిటీ వెపన్‌తో రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు సర్దార్‌ ఖాన్‌. ఈ ఘటనలో సురేందర్‌ తీవ్రంగా గాయపడటమే కాక, సమీపంలో ఉన్న ఒక మహిళా కస్టమర్‌ కడుపులోకి బుల్లెట్‌ దూసుకెళ్లడంతో ఆమెకు కూడా బాగా గాయాలయ్యాయి.

కాంట్రాక్ట్ ఉద్యోగి సురేందర్‌ మరియు సెక్యూరిటీ గార్డు ఇద్దరి మధ్య తలెత్తిన ఒక వివాదం చివరకు కాల్పులు జరిపే వరకు వెళ్ళినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సురేందర్‌ను, మహిళను హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డు సర్దార్‌ ఖాన్‌ను అబిడ్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ వివాదానికి సంబంధించి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular