పుణే: గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2022 లో ప్లే ఆఫ్స్ బెర్థ్ సాధించిన తొలి జట్టయింది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న గుజరాత్ మరియు లక్నో మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్ 144 పరుగులకే పరిమితమైంది.
దీంతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం ఖాయమని భావించినా ఫలితం మాత్రం తారుమారైంది. మంచి బౌలింగ్ తో సత్తా చాటిన టైటాన్స్ జట్టు సూపర్ జెయింట్స్‌ను మరో 37 బంతులు మిగిలి ఉండగానే ఆలౌట్ చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గా శుబ్‌మన్ గిల్ (49 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు) ఎంపికయ్యాడు.
చేజింగ్ లో లక్నో 13.5 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటైంది. దీపక్ హుడా (26 బంతుల్లో 27; 3 ఫోర్లు)దే అత్యధిక స్కోరు కాగా, ఎనిమిది మంది సింగిల్ డిజిట్‌కే అవుటయ్యారు. రషీద్ ఖాన్ (4/24) కీలక వికెట్లతో చెలరేగాడు.