fbpx
HomeNationalఎన్నికల వేళ ఇలాంటి హామీలు ఎక్కడైనా కన్నారా, విన్నారా?

ఎన్నికల వేళ ఇలాంటి హామీలు ఎక్కడైనా కన్నారా, విన్నారా?

CRAZY-ELECTION-MANIFESTO-EVER-BY-THULAM-SARAVANAN

తమిళనాడు: ఎన్నికల వేళ మనం ఎన్నో రకాల హామీలు చూస్తుంటాం. సాధారణంగా ఎన్నికలంటే ఓటుకు వెయ్యి నోటు, ఏవో రకాల గిఫ్టులు ఇస్తారు గానీ ఏకంగా కోటి రూపాయలు ఇస్తానని మధురైలోని ఓ మహానుభావుడు హామిళు ఇచ్చాడు.

ఇదంతా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఓ తమిళ తంబి ఇలాంటి హామీలను చూస్తే ఎవరికైనా షాక్‌తో దిమ్మతిరిగి బొమ్మ కనపడాల్సిందే. తనను ఎన్నికల్లో గెలిపిస్తే ఆయన ప్రజలను షికారుకి తీసుకెని వెళ్తానని అంటున్నాడు. షికారు ఎక్కడికో కాదండి, ఏకంగా చంద్రుని పైకే ట్రిప్‌ కి తీసుకెల్తాడంట.

తమిళనాడు కు చెందిన తులమ్‌ శరవణన్ మధురై దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీలో నిలబడ్డ ఒక స్వతంత్ర అభ్యర్థి. ఇతని వెరైటీ వాగ్దానాల జాబితాలో ఏకంగా మినీ-హెలికాప్టర్, ప్రతి ఇంటికి ఒక కోటి వార్షిక డిపాజిట్ వారి ఇంట్లో వివాహాలకు బంగారు ఆభరణాలు, మూడు అంతస్థుల ఇల్లు మరియు చంద్రుని పర్యటన ఉన్నాయి.

ఆతను ఇచ్చిన మ్యానిఫెస్టోలో వాగ్దానాలు నియోజకవర్గ ప్రజల దృష్టిని అమితంగా ఆకర్షించాయి. కాగా ఈ బాబు అంతటితో ఆగకుండా గృహిణుల పనిభారాన్ని తగ్గించే ఒక రోబోట్, ప్రతి కుటుంబానికి ఒక పడవ, నియోజకవర్గ ప్రజలను చల్లగా ఉంచడానికి 300 అడుగుల ఎత్తైన కృత్రిమ మంచు పర్వతం ఏర్పాటు, అంతరిక్ష పరిశోధన కేంద్రం, రాకెట్ లాంచ్ ప్యాడ్ కూడా ఇస్తానని హామీ ఇచ్చారు.

వినడానికి ఎంతో విడ్డూరంగా అనిపించే ఈ హామీల గురించి అతను ఏమంటున్నాడంటే, ఎన్నికలంటే చాలు అభ్యర్థుల నోటి నుంచి హామీలు వర్షాకాలంలో వరదల్లా వస్తుంటాయ్‌ అవి ఆచరణకు సాధ్యమున్నా కాకపోయినా, అందుకే ప్రజలు మాటల అభ్యర్థులను కాకుండా చేతల అభ్యర్థులను ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నానని అందుకే ఈ వెరైటీ హామీలని శరవణన్ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular