fbpx
HomeAndhra Pradeshవిశాఖలో మళ్ళీ మొదలైన సినిమా షూటింగ్‌లు

విశాఖలో మళ్ళీ మొదలైన సినిమా షూటింగ్‌లు

CINEMA-SHOOTINGS-RESTART-IN-VIZAG

విశాఖపట్నం: కరోనా లాక్ డౌన్ ముగిసిన తరువాత ఇప్పుడు విశాఖలో సినిమా షూటింగ్ సందడి తిరిగి మొదలైంది. 4వ అన్‌లాక్‌తో నిబంధనలు సడలించడంతో ఇతర ప్రాంతాల నుంచి ఆర్టిస్టు లు కూడా విశాఖ చేరుకుంటున్నారు.

విశాఖ కేంద్రంగా సినీ పరిశ్రమ అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన తరువాత జోష్ ఎక్కువగా కనిపిస్తోంది. విశాఖ నగరం అంటే ప్రకృతి అందాలకు నెలవు. నీటి సముద్రానికి పచ్చని కొండలు తోడవడంతో పర్యాటకులతో పాటు సినిమా షూటింగులో కూడా అనువైన ప్రాంతంగా మారింది.

1971 ప్రాంతంలో ప్రముఖ దర్శకుడు బాలచందర్ సినీ ఫ్రేమ్‌లో విశాఖను ఆవిష్కరించడంతో నగర అందాలు బయట ప్రపంచానికి తెలిశాయి. యారాడ, అప్పికొండ, ఆర్కే బీచ్, రుషికొండ, తొట్లకొండ, భీమిలి… ఇలా భిన్న మైన ప్రకృతి అందాల తో కూడిన ఈ ప్రదేశాలు షూటింగ్ సీన్స్ సినిమాల్లో ప్రత్యేకతను చాటుతున్నాయి. ఇక సింహాచలం కొండ సెంటిమెంట్‌గా మారడంతో చాలా మంది నటులు కొన్ని సీన్లు అక్కడ తీయాలని పట్టుబడుతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి.

మెగాస్టార్ చిరంజీవికి కొత్త కేరీర్ విశాఖ ఇచ్చింది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలెంజ్, అభిలాష, జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి సినిమాలతో విశాఖనగరం చిరంజీవి సినీ చరిత్రనే మార్చేసింది. సర్పయాగం, చామంతి లాంటి సినిమాలు రోజాకు కొత్త సినిమా జీవితాన్ని అందించాయి. బాలకృష్ణ అయితే సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, లెజెండ్ వంటి సినిమాలో సింహాచలం కేంద్రంగానే సెంటిమెంట్‌గా కొనసాగాయి.

ఇక అరకు అందాల గురించి చెప్పనవసరం లేదు. ఆలాపన, స్టేషన్ మాస్టర్, కృష్ణ, ఒక్కడు, కృష్ణ గాడి వీర ప్రేమ కథ ఇలాంటి సినిమాలు ఎన్నో ఇక్కడే ఊపిరి పోసుకున్నాయి. కోవిడ్‌ కారణంగా షూటింగ్‌ సందడి తగ్గింది. ముఖ్యంగా బీచ్‌ను ఆనుకునే ఉన్న రామానాయుడు స్టూడియోలో జరిగే ఒడిస్సా బెంగాలీ,అసామి లాంటి చిన్న బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ దశలో దాదాపు ఐదు నెలల తర్వాత అన్‌లాక్‌ ప్రక్రియ మొదలవడంతో విశాఖలో సినిమా షూటింగ్ లు మళ్ళీ మొదలయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular