fbpx
Tuesday, April 23, 2024
HomeMovie Newsమొదలైన తెలుగు బిగ్ బాస్ 4

మొదలైన తెలుగు బిగ్ బాస్ 4

BigBossSeason4 Final ContestantsList

హైదరాబాద్: ఈ రోజు నుండి తెలుగు బిగ్ బాస్ ప్రారంభం అవబోతోంది. సీజన్ 3 కి హోస్ట్ గా చేసిన నాగార్జున నే సీజన్ 4 ని కూడా హోస్ట్ చేస్తున్నాడు. మొదటి మూడు సీజన్ లు సూపర్ హిట్ అవడం తో అలాగే ఈసారి కరోనా పరిస్థితులవల్ల ఎక్కువమంది ఇంటి దగ్గరే ఉండడం తో ఈ సారి ఈ షో ని ఇంకా సూపర్ డూపర్ హిట్ చేసే ప్లాన్ లో ఉన్నారు స్టార్ మా టీం వాళ్ళు. ఈ సీజన్ కంటెస్టెంట్స్ ని కూడా అలాగే సెలెక్ట్ చేసారు బిగ్ బాస్ మేనేజ్మెంట్. ఎట్టకేలకు చాలా రూమర్స్ ని నిజం చేస్తూ చాలా రూమర్స్ ని కొట్టి పారేస్తూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ జాబితా ఆకట్టుకుంది. చాలా వరకు ముందు వచ్చిన రూమర్స్ ఏ నిజం అయ్యాయి.

కంటెస్టెంట్స్ విషయానికి వస్తే సుడిగాడు హీరోయిన్ ‘మోనాల్ గుజ్జార్’, సత్యం డైరెక్టర్ ‘సూర్య కిరణ్’, యాంకర్ ‘లాస్య’, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ హీరో ‘అభిజిత్’, న్యూస్ రీడర్ ‘సుజాత’, యు ట్యూబ్ స్టార్ ‘మెహబూబ్’, tv9 న్యూస్ రీడర్ ‘దేవి’ , యు ట్యూబ్ స్టార్ ‘హారిక’, యాక్టర్ ‘సయ్యద్ సోహైల్’, ఆర్జివీ ఇంటర్వ్యూ ద్వారా ఫేమస్ అయిన ‘అరియనా గ్లోరీ’, కొరియోగ్రాఫర్ ‘అమ్మ రాజశేఖర్’, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ‘కరాటే కళ్యాణి’, సింగర్ ‘నోయెల్’, యాక్టర్ ‘దివి’, సీరియల్ హీరో ‘అఖిల్ సార్థక్’ చివరగా యు ట్యూబ్ సెన్సేషన్ ‘గంగవ్వ’. ఎప్పటి లాగే ఈ సారి కూడా వివిధ రంగాలకి చెందిన వాళ్ళని కంటెస్టెంట్స్ గ సెలెక్ట్ చేసుకున్నారు బిగ్ బాస్ టీం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular