fbpx
Thursday, June 8, 2023

INDIA COVID-19 Statistics

44,992,293
Confirmed Cases
Updated on June 8, 2023 9:12 pm
531,886
Deaths
Updated on June 8, 2023 9:12 pm
2,687
ACTIVE CASES
Updated on June 8, 2023 9:12 pm
44,457,720
Recovered
Updated on June 8, 2023 9:12 pm
HomeInternationalచైనాను మళ్ళీ కలవరపెడుతున్న కరోనా, జిన్ పింగ్ సంచలన నిర్ణయం!

చైనాను మళ్ళీ కలవరపెడుతున్న కరోనా, జిన్ పింగ్ సంచలన నిర్ణయం!

CHINA-COVID-CASES-RISE-AGAIN

బీజింగ్: చైనాలో పుట్టి ప్రపంచాన్ని చుట్టిన కరోనా ఇప్పుడు మళ్ళీ చైనాలో కలకలం సృష్టిస్తోంది. మళ్ళీ అక్కడ రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండటం ఆ దేశ సర్కార్‌ను తీవ్ర టెన్షన్‌కు గురిచేస్తోంది. నిన్న అనగా ఆదివారం ఒక్కరోజే ఏకంగా 13 వేల కొత్త కేసులు వెలుగు చూశాయి.

కాగా గత రెండేళ్ల కాలంలో ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇవే గరిష్ట కేసులుగా చైనా ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఆదివారం నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 70 శాతం కేసులు ఒక్క షాంఘైలోనే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ కట్టడిలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది.

ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం ఇప్పుడు మరొక కీలక నిర‍్ణయం తీసుకుంది. సోమవారం ఆ ప్రాంతంలో ఉన్న 26 మిలియన్ల మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇక్కడ టెస్టుల కోసం చైనా మిలిటరీని, వేలాది మంది ఆరోగ్య కార్యకర్తలను షాంఘైకి పంపింది.

ఇటీవల ఆర్మీ, నేవీ, జాయింట్ లాజిస్టిక్స్ సపోర్ట్ ఫోర్స్‌ల నుండి రిక్రూట్ అయిన 2,000 మందికి పైగా వైద్య సిబ్బందిని షాంఘైకి పంపినట్లు సాయుధ దళాల వార్తాపత్రిక నివేదించింది. దీంతో వీరందరూ షాంఘైలో ఉన్న ప్రజలకు టెస్టులు నిర్వహించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular