వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు మరియు టెస్లా, స్పేస్ ఎక్స్ ఫౌండర్ అయిన ఎలన్ మస్క్ సోషల్‌మీడియా వ్యాపారంలోకి తన గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రపంచ ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ అయిన ట్విటర్లో ఎలన్ మస్క్ షేర్లను కొన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో ట్విటర్ షేర్లు రయ్ రయ్‌మంటూ పైకి దూసుకెళ్లాయి.
తాజాగా ఎలన్ మస్క్ ట్విటర్లో 9.2 శాతం వాటాలను కొన్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 10, 2022 నాటికి ట్విటర్లో 9.2 శాతం వాటాను ఎలన్ మస్క్ కలిగి ఉన్నారని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ తమ ఫైలింగ్‌లో తెలిపింది. ఎలన్ మస్క్ తమ కంపెనీలో 73,486,938 షేర్లను కొనుగోలు చేశారని ట్విటర్ ఇంక్ కూడా తాము చేసిన ఫైలింగ్‌లో పేర్కొంది.
కాగా ఈ షేర్లు విలువ శుక్రవారం క్లోజింగ్ ధర 2.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ట్విటర్లో ఎలన్ మస్క్ వాటాలను కొన్నారనే వార్తల నేపథ్యంలో ట్విటర్ కంపెనీ యొక్క షేర్లు ఒకే సారి 25.8 శాతం పైకి ఎగిశాయి. దీంతో ట్విటర్ ఇంక్ షేరు వాల్యు 49.48 డాలర్లకు చేరింది. ఈ వాటాల కొనుగోలుతో ట్విటర్లో అతిపెద్ద షేర్ హోల్డర్‌గా ఎలన్ మస్క్ నిలిచారు.