fbpx
HomeLife Styleబీఎస్‌ఎన్‌ఎల్‌ నుండి యూజర్లకు బంపరాఫర్, జియోకి పోటీ!

బీఎస్‌ఎన్‌ఎల్‌ నుండి యూజర్లకు బంపరాఫర్, జియోకి పోటీ!

BSNL-GIVES-BUMPER-OFFER-TO-SUBSCRIBERS-AMID-NEWYEAR

న్యూఢిల్లీ: భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) భారత్ యొక్క ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ, తాజాగా జియోకు పోటీగా ఒక అద్భుతమైన ఆఫర్‌ను తీసుకువచ్చింది. కొత్త సంవత్సరం‌ సందర్భంగా జియో తన యూజర్ల కోసం వార్షిక ప్రీపెయిడ్‌ ప్లాన్‌ రూ. 2545కు అదనంగా 29 రోజుల వ్యాలిడిటీను ప్రకటించింది. ఇప్పుడు కొత్తగా జియోకు పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్ తమ యూజర్లకు ఒక‌ భారీ ఆఫర్‌ను ప్రకటించింది.

ఇటీవల భారత్ లో ఉన్న ప్రైవేటు టెలికాం సంస్థలకు పోటీనివ్వడానికి ప్రభుత్వ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ తన వినియోగదార్ల కోసం వరుసగా ఆఫర్లను ప్రకటిస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా‌ వార్షిక ప్రీపెయిడ్‌ ప్లాన్‌ రూ. 2,399పై ఏకంగా 90 రోజుల అదనపు వ్యాలిడిటీని కూడా ప్రకటించింది. ఇంటకు ముందు ఈ ప్లాన్‌పై 60 రోజుల అదనపు వ్యాలిడిటీని కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌ అందించింది.

ఇప్పడు మరో 30 రోజుల అదనపు వ్యాలిడిటీ వర్తిస్తోందని బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రకటనలో పేర్కొంది. దీంతో మొత్తంగా వార్షిక ప్రీపెయిడ్‌ ప్లాన్‌ రూ. 2,399పై యూజర్లకు ఏకంగా 455 రోజుల వ్యాలిడిటీ రానుంది. ఈ ఆఫర్ జనవరి 15 వరకు అందుబాటులో ఉండనుంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ వార్షిక ప్రీపెయిడ్‌ ప్లాన్‌ రూ. 2,399పై అదనపు వ్యాలిటిడీతో పాటుగా చాలా ఆఫర్లను‌ అందిస్తోంది. ఈ ప్లాన్‌తో యూజర్లు ప్రతి రోజు 3 జీబీ డేటా వరకు పొందవచ్చు. దానితో పాటుగా అపరిమిత వాయిస్ కాల్స్ రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను కూడా‌ అందిస్తోంది. ఈ ప్లాన్‌పై ప్రముఖ ఓటీటీ ఈరోస్ నౌ సేవలను కూడా యూజర్లు సొంతం చేసుకోవచ్చును. ఈ ప్లాన్‌తో బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్‌లకు యాక్సెస్‌ చేసుకోవచ్చును.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular