వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై బీజేపీ సీనియర్ నేత, మంత్రి సత్యకుమార్ యాదవ్ కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి జగన్‌పై తీవ్ర స్థాయిలో ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. జగన్ పాలన వల్ల ఏపీ ధ్వంసమైందని, కేంద్రం ఇచ్చిన నిధులను సక్రమంగా వాడలేదని సత్యకుమార్ ఆరోపించారు.
ఫలితంగా నిధులు లేక రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. అలాగే, వైసీపీ అధినేత కాంగ్రెస్ వైపు చూస్తున్నారని సత్యకుమార్ హోం మంత్రికి వివరించారు. హరియాణా ఎన్నికల ఫలితాలు, ఈవీఎంలపై జగన్ చేసిన వ్యాఖ్యల గురించి కూడా అమిత్ షాకు వివరించారు.
గత రెండు నెలలుగా జగన్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారనీ, మద్దతు ఇవ్వవచ్చని చెప్పినట్లు సమాచారం. ఇక, సత్యకుమార్ చేసిన ఫిర్యాదులపై అమిత్ షా స్పందన ఎలా ఉంటుందో చూడాలి. బీజేపీ నేతలు ఈ పరిణామాన్ని జగన్‌కు భారీ షాక్‌గా భావిస్తున్నారు.
కానీ, ఇప్పటివరకు జగన్‌కు కేంద్రంతో సత్సంబంధాలే ఉన్నాయన్నది వాస్తవం. సో, సత్యకుమార్ ఆశించినంత స్థాయిలో మార్పులు వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు.