fbpx
HomeMovie News'అమృత' అంటూ బ్రేకప్ సాంగ్ విడుదల చేసిన సాయి తేజ్

‘అమృత’ అంటూ బ్రేకప్ సాంగ్ విడుదల చేసిన సాయి తేజ్

BreakupSong ReleasedFrom SoloBratukeSoBetter

టాలీవుడ్: సాయి ధరమ్ తేజ్ చాలా ప్లాప్ ల తర్వాత ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజు పండగే’ సినిమాల ద్వారా హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. సాయి ధరమ్ తేజ్ తన తదుపరి సినిమా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో బివిఎస్ఎస్ నిర్మాణంలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా సుబ్బు అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఈ రోజు సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి ‘అమృత’ అనే బ్రేక్ అప్ పాటని మెగా స్టార్ చిరంజీవి చేతులమీదుగా విడుదల చేయించారు.

థమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుండి ఇప్పటికి విడుదలైన రెండు పాటలు ఆకట్టుకున్నాయి. ఈ బ్రేకప్ సాంగ్ కూడా ఇన్స్టంట్ హిట్ గా దూసుకెళ్తుంది. రెగ్యులర్ బ్రేకప్ పాటల్లానే ఈ పాట లిరిక్స్ కూడా ఉన్నాయి. కాసర్ల శ్యామ్ అందించిన లిరిక్స్ క్యాచీ గానే ఉన్నాయి కానీ పెద్ద ఇంపాక్ట్ ఏమీ అనిపించలేదు. ఈ పాటని సింగర్ నకాష్ అజీజ్ ఆలపించారు. ఈ పాటకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ సినిమా మొత్తం వైజాగ్ బాగ్ గ్రౌండ్ లో రూపొందించబడింది. ఇప్పటికి విడుదలైన రెండు వీడియో సాంగ్స్ లో అది కనిపిస్తుంది. సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయింది కానీ సరైన సమయం కోసం చూసి విడుదల చేసే ప్లాన్ లో ఈ మూవీ మేకర్స్ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular