fbpx
Wednesday, April 24, 2024
HomeMovie Newsవరుస సినిమాలతో దూసుకెళ్తున్న శౌర్య

వరుస సినిమాలతో దూసుకెళ్తున్న శౌర్య

NagaShourya Crazy MovieLineUp

టాలీవుడ్: చిన్న హీరోగా ప్రయాణం ప్రారంభించి మంచి లవ్ స్టోరీస్ లో నటించి చాక్లెట్ బాయ్ ఇమేజ్ సంపాధించిన హీరో నాగ శౌర్య. తన సొంత బ్యానర్ లో ‘చలో’ లాంటి సూపర్ హిట్ సాధించిన తర్వాత వరుసగా మూడు ప్లాప్ లు ఎదుర్కొని మళ్ళీ ‘అశ్వద్ధామ’ సినిమా ద్వారా తానే స్వయంగా కథ రాసి కొంత వరకి పరవాలేదనిపించుకున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్ నుండి యాక్షన్ హీరోగా మారడానికి చాలానే కష్టపడుతున్నాడు ఈ హీరో. అయితే ఈ హీరో ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు లైన్ లో పెట్టాడు.

ఏషియన్ ఫిలింస్ నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్న ఒక సినిమాలో సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నటించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ అప్ డేట్ ఇంతవరకి తెలియదు కానీ అధికారిక ప్రకటన అయితే చేసారు. అనీష్ కృష్ణ దర్శకత్వం లో ఒక స్పోర్ట్స్ బేస్డ్ మూవీ కూడా చేస్తున్నాడు. దీనికి సంబదించిన ఫుల్ హెయిర్ తో, సిక్స్ ప్యాక్ బాడీ తో విడుదల చేసిన లుక్ తో చాల మందిని షాక్ కి గురి చేసాడు శౌర్య. అయితే ఆ సినిమాలో ఆ లుక్ కి సంబంచించిన షూట్ అంత ఫినిష్ చేసి మళ్ళీ నార్మల్ లుక్ కి మారిపోయాడు శౌర్య.

దీనితో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మరొక సినిమాలో చేస్తున్నాడు నాగ శౌర్య. ఈ సినిమా ద్వారా ‘లక్ష్మి సౌజన్య’ అనే కొత్త దర్శకురాలు ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలయింది. ఈ సినిమాకి ‘పడి పడి లేచె మనసు’, ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ కి సంగీతం అందించిన మెలోడియస్ కంపోజర్ ‘విశాల్ చంద్రశేఖర్‘ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో శౌర్య కి జోడి గా ‘రీతూ వర్మ’ నటిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular