టాలీవుడ్: టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బిజీ గా ఉన్న నటుడు బ్రహ్మాజీ. దాదాపు ఏ సినిమా చూసిన ఏదో ఒక క్యారెక్టర్ లో బ్రహ్మాజీ కనపడుతూ ఉంటాడు. ప్రస్తుతం ఈ కరోనా పరిస్థితుల్లో సోనూ సూద్ చేస్తున్న సాయం చూసి సోనూ సూద్ ని మహాత్మ తో పోల్చాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఏక్ నిరంజన్ సినిమాలో సోనూ సూద్ , బ్రహ్మాజీ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. ఆ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కన్నా వీళ్ళ సీన్స్ కే రెస్పాన్స్ ఎక్కువ ఉంది. ఈరోజు సోనూ సూద్ పుట్టిన రోజు సందర్భంగా బ్రహ్మాజీ సోనూ సూద్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ గవర్నమెంట్ సోనూ కి పద్మభూషణ్ ఇవ్వాలని చెప్పారు. అలాగే తనలో ఒక మహాత్ముడు ఉన్నాడని చెప్పాడు.
అలాగే ఎవరు సహాయం అడిగినా లేదనుకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికీ సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకున్నాడు. ప్రాంతం, కులం, భాషతో సంబంధం లేకుండా ఆపదలో ఉన్నవారిని అండగా నిలుస్తున్నాడు. ఇక ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న ఒక రైతుకు ట్రాక్టర్ పంపించి.. ఎంతో మంది ప్రశంసలు అందుకున్నాడు. తాను చేస్తున్న సాయానికి ఇపుడు చాలా మంది తోడవడంతో ఒక్కడు గా మొదలుపెట్టిన తన ప్రయాణం ఒక వ్యవస్థ గా ముందుకి సాగుతుంది. సాయం చేయకున్నా కూడా కోడిగుడ్డు పైన బొచ్చు పీకే బ్యాచ్ ఉన్నప్పటికీ సోనూ సూద్ అవేవి పట్టించుకోకుండా తోచిన సాయం చేస్తున్నాడు. అలాగే ఉద్యోగాలు కోల్పోయిన మూడు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే పని లో ఉన్నాడు ఈ నటుడు.