హైదరాబాద్: లాక్ డౌన్ ముగిసిన తర్వాత దేశం లో కరోనా సంఖ్యలు బాగానే పెరుగుతున్నాయి. కరోనా కేసులతో పాటు మరణాలు కూడా బాగానే సంభవిస్తున్నాయి. ఇప్పటివరకు పట్టణాలకే పరిమితం అయిన కేసులు ఇప్పుడు గ్రామాల్లో కూడా బాగానే రికార్డ్ ఐతున్నాయి. ఇప్పటి వారికి చాలామంది సినీ సెలెబ్రిటీలకి కరోనా సోకింది. టాలీవుడ్ లో అగ్ర దర్శకుడిగా పేరుపొందిన యస్ యస్ రాజమౌళి కి కూడా కరోనా సోకినట్టు ఆయన ఇవాళ ధృవీకరించారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకి కూడా కరోనా సోకినట్టు ట్వీట్ చేశారు.
కొద్దీ రోజులుగా తనకి తన కుటుంబ సభ్యులకి జ్వరం వచ్చిందని ఇపుడు అది తగ్గిపోయినప్పటికీ కరోనా టెస్ట్ చేయించుకున్నామని కాకపోతే రిసల్ట్ పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ఇప్పటికి కరోనా లక్షణాలు ఏమీ లేనప్పటికీ వైద్యుల సూచనల మేరకి హోమ్ క్వారంటైన్లోనే ఉన్నామని చెప్పారు. యాంటీ బాడీస్ వృద్ధి చెందే సమయం కోసం ఎదురుచూస్తున్నాం. పూర్తిగా నయం అయినా తర్వాత ప్లాస్మా డొనేట్ చెయ్యడం కోసం ఎదురుచూస్తున్నాం అని ట్వీట్ చేసారు.
ఇప్పటివరకు టాలీవుడ్ లో కొందరు సీరియల్ నటులకి అలాగే నిర్మాత బండ్ల గణేష్ లాంటి వారికి కరోనా సోకి నయం అయ్యారు. ఇపుడు రాజమౌళికి సోకడంతో ఇండస్ట్రీ అంతా జాగ్రత్త పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలు పెట్టుకునే ఆలోచనలో ఉన్న సినిమా నిర్మాతలు, హీరోలు మళ్ళీ ఆలోచనలో పడ్డారు అని చెప్పుకోవచ్చు.
when is RRR release date. its already getting late.