వాషింగ్టన్: యూరప్ దేశాల పర్యటనలో భాగంగా, అమెరికా అధ్యక్షుడు బైడెన్ యుద్ధ క్షేత్రానికి సమీపంగా వెళ్లారు. రష్యా బాంబుల దాడికి అల్లాడుతున్న ఉక్రెయిన్ పొరుగు దేశం పోల్యాండ్‌లో బైడెన్ పర్యటించారు.
ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై బైడెన్ సంచలన వ్యాఖ్యలను చేశారు. పలు దేశాల కూటమిగా ఉన్న నాటోను చీల్చే దిశగా పుతిన్ చాలా ప్రయత్నాలే చేసారని ఆరోపించారు, అందులో పుతిన్ ఘోరంగా విఫలమయ్యారని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం నేపథ్యంలో నాటో కూటమి ఉక్రెయిన్ వైపు నిలిచాయి. ఇదే విషయాన్ని ప్రస్తావించిన బైడెన్.. ఉక్రెయిన్‌ను ఏకాకిగా చేసేందుకు పుతిన్ నాటోనే చీల్చేందుకు యత్నించి బొక్కబోర్లా పడ్డారని బైడెన్ వ్యాఖ్యానించారు. అలాగే పుతిన్‌ను పరమ కసాయి అని బైడెన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.