fbpx
HomeInternationalనాసా తాత్కాలిక చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా భవ్యా లాల్

నాసా తాత్కాలిక చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా భవ్యా లాల్

BHAVYALAL-NASA-CHIEF-STAFF-APPOINTED-BY-BIDEN

వాషింగ్టన్‌: యూఎస్ కు నూతన అధ్యక్షడిగా ఎంపికై బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్‌, తన జట్టులో మహిళలకు, మరీ ముఖ్యంగా భారతసంతతి కి చెందిన వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలు చాలా చూశాము. ఇప్పటికే పలువురు ఇండో అమెరికన్లకు కీలక బాధ్యతలు అప్పగించిన అధ్యక్షుడు‌ ఇప్పుడు మరో భారత సంతతి మహిళను అత్యున్నత పదవికి నామినేట్‌ చేశారు.

యూఎస్ ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన నాసా కు తాత్కాలిక చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా ఇండో అమెరికన్‌ భవ్యా లాల్‌ ను నియమించారు. ఆమెతో పాటు ఫిలిప్ థామ్సన్ వైట్ హౌస్ అనుసంధానకర్తగా వ్యవహరించనున్నారు. ఇక భవ్యా లాల్‌ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అధికార మార్పిడి బృందంలో నాసా తరఫున సభ్యురాలిగా పనిచేశారు. నాసాలో అధికారుల నియామకంలో కీలకంగా వ్యవహరించారు.

నాసా అంతరిక్ష సాంకేతిక రంగాభివృద్ధి, అమెరికా శాస్త్రీయ, సాంకేతిక విధానాల రూపకల్పనలో భవ్య కీలక పాత్ర పోషించారు. ఇక నాసా ఏర్పడిన 63 ఏళ్ల తర్వాత తొలిసారి ఓ మహిళా అధిపతిగా ఎన్నికవ్వడం.. అందులోనూ భారత సంతతి మహిళను ఈ అత్యున్న పదవి వరించడం గౌరవంగా భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular