fbpx
HomeMovie Newsకొడుకుతో ఆదిత్య 369 సీక్వెల్ ప్లాన్ చేస్తున్న బాలయ్య

కొడుకుతో ఆదిత్య 369 సీక్వెల్ ప్లాన్ చేస్తున్న బాలయ్య

BalakrishnaPlanning Aditya369Sequel WithHisSon

టాలీవుడ్: తెలుగు సినిమాలు 2000 సంవత్సరం నుండి కమర్షియల్ బాట పట్టాయి. అంతకముందు ఫామిలీ సినిమాలు, సమాజాన్ని, ఉద్యమాల్ని ఉద్దేశించిన సినిమాలు చాలానే వచ్చాయి ఆ కాలంలో సూపర్ హిట్ అయ్యాయి కూడా. ఇవే కాకుండా ప్రయోగాత్మక చిత్రాలు కూడా ఎక్కువే. అందులో బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369 ‘ కొంచెం స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఒక టైం ట్రావెల్ సినిమా ఆ కాలంలో చేయడం అంటే సాహసం అనాలి, ఆ సాహసానికి తోడు అందులో పౌరాణికం అంటే చాలా రిస్క్ తో కూడుకున్న పని. కానీ ఇంతటి ప్రయోగాత్మక సబ్జెక్టు ని ఎగ్జిక్యూట్ చేసి ఇప్పటివరకు అలాంటి కాన్సెప్ట్ కి ఇన్ని సంవత్సరాలైనా ఈ సినిమాని మించిన సినిమా రాలేదు అంటే అర్ధం చేసుకోవచ్చు మన వాళ్ళు అప్పట్లో సినిమాలు ఎంత విజన్ తో చేసేవారో.

ఇపుడు ఇదంతా ఎందుకు చెప్పుతున్నాం అంటే ఈ రోజు నందమూరి బాల కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ సినిమాకి సీక్వెల్ తీసే ప్లాన్ లో ఉన్నట్టు తెలిపారు. ఇదే ఒక షాకింగ్ న్యూస్ అంటే ఈ సినిమాని తానే డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలిపాడు. ఇంకా షాకింగ్ ఏంటి అంటే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తన కొడుకు మోక్షజ్ఞ పరిచయం ఆ సినిమాతోనే ఉండబోతుందని తెలిపాడు. ఆ సినిమాతో మోక్షజ్ఞ ని తెలుగు తెరకి పరిచయం చేయడం మాత్రమే కాకుండా ఇద్దరం కలిసి నటిస్తాం అని బాలకృష్ణ తెలిపారు. మరి ఈ ప్రయోగం, ప్రయత్నం ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగి మరొక బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ కి అందించాలని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular