fbpx
HomeAndhra Pradeshఏపీ ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ విడుదల

ఏపీ ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ విడుదల

AP-WELFARE-SCHEMES-CALENDAR-2021-22-RELEASED

అమరావతి: ఏపీ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను అమలు చేయబోతున్న సంక్షేమ పథకాల క్యాలండర్‌ను మంగళవారం ఏపీ మంత్రివర్గం ఆమోదించిందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని పత్రికా సముఖంగా తెలిపారు. చెప్పాడంటే చేస్తాడంతే అని పేరు సీఎం జగన్ పేరు తెచ్చుకున్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

ఈ క్యాలెండర్ లో రాష్ట్రంలో ఏ నెలలో ఏ పథకం అమలవుతుందనే అంశాన్ని తెలపడానికి మంత్రివర్గం ఆమోదం లభించినట్లు చెప్పారు. మంత్రివర్గ సమావేశ నిర్ణయాలపై మంత్రి బుధవారం ఆయన మీడియాకు వివరించారు. దుర్గ గుడిలో అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తే రాష్ట్ర మంత్రి వెల్లంపల్లిపై ఆరోపణలు చేయడం శోచనీయమని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.

సంక్షేమ క్యాలెండర్‌ వివరాలు: ఏప్రిల్‌: వసతి దీవెన, విద్యాదీవెన, రైతులకు, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ అమలు
మే: మత్స్యకార భరోసా
జూన్‌: వైఎస్సార్ చేయూత, జగనన్న విద్యా కానుక అమలు
జూలై: వైఎస్సార్ వాహన మిత్ర పథకం
ఆగస్టు: నేతన్న నేస్తం, అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం
సెప్టెంబర్: వైఎస్సార్ ఆసరా
అక్టోబర్: రైతు భరోసా రెండో విడత, చేదోడు, తోడు పథకాల అమలు
నవంబర్: కొత్తగా ఆమోదించిన ఈబీసీ నేస్తం
డిసెంబర్: విద్యాదీవెన, వసతి దీవెన రెండు, మూడో విడత అమలు, లా నేస్తం
2022 జనవరి: రైతు భరోసా మూడో విడత, అమ్మఒడి, పింఛన్ 2,500కు పెంపు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular