తాడేపల్లి : ఆంధ్ర ప్రదేశ్ లో క్రమంగా కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయి. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ ఆంక్షలను తీసివేస్తున్నట్టు తెలిపారు.
అయితే రాష్ట్రంలో ప్రజలందరూ ప్రతి ఒక్కరూ మాస్కులు కచ్చితంగా ధరించే నిబంధన మాత్రం అమలు లో ఉంచాలని ఆయన నిర్ణయించారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని అధికారుల్ని సీఎం జగన్ ఆదేశించారు.
అలాగే రాష్ట్రంలో ఫీవర్ సర్వే కొనసాగించాలన్న సీఎం, కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి క్రమంగా టెస్టులు చేయాలని అధికారులకు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్‌ను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. సిబ్బంది తప్పనిసరిగా ఆస్పత్రుల్లో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పరిపాలనా బాధ్యతలను అందులో నిపుణులైన వారికి అప్పగించాలని తెలిపారు.