fbpx
HomeMovie Newsట్రెండ్ సెట్టింగ్ సినిమాకి 17 ఏళ్ళు

ట్రెండ్ సెట్టింగ్ సినిమాకి 17 ఏళ్ళు

AlluArjun EmotionalTweetOn AryaMovie

టాలీవుడ్: 17 ఏళ్ల క్రితం ఈరోజు ఒక సినిమా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఆరోజు తెలియదు ఆ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి ఎంతో మంది టాలెంటెడ్ టెక్నిషియన్స్ ఇండస్ట్రీ కి పరిచయం అవుతారని, అలాగే ఆ టెక్నిషియన్స్ కి కూడా తెలియదు ఆ సినిమా వాళ్ళందరి కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అవుతుందని. ఆ సినిమానే ఆర్య. గంగోత్రి ద్వారా పరిచయం అయినా అల్లు అర్జున్ ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గా నిలబెట్టడం లో మొదటి మెట్టు ఆర్య అని చెప్పవచ్చు. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ మొదటి సారి సూపర్ సక్సెస్ చూసి ఆ తర్వాత వెనుతిరిగి చూసుకునే అవకాశం రాలేదు.

ఈ సినిమా ద్వారా టాలీవుడ్ గర్వపడే దర్శకుడు ‘సుకుమార్’ రూపం లో అవతరించాడు. ఇలాంటి కాన్సెప్ట్ తో ఇలాంటి కారెక్టరైజెశన్ తో హీరో ఉండొచ్చు అని ఆ తర్వాత రాబోతున్న దర్శకులకి ఆదర్శంగా నిలిచాడు. తర్వాత స్టైలిష్ అండ్ ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి సూపర్ సక్సెస్ లని అందించడమే కాకుండా సొంత బ్యానర్ లో కొత్త రకమైన కథలతో నిర్మాతగా కూడా సక్సెస్ చూస్తున్నాడు. ఈ సినిమాతో నిర్మాత దిల్ రాజు సూపర్ సక్సెస్ అందుకున్నాడు. నిర్మాతగా దిల్ రాజు కి ఇది రెండో సక్సెస్ కానీ అప్పుడప్పుడే నిర్మాతగా తొలి అడుగులు వేస్తున్న దిల్ రాజు కి ఈ సినిమా మంచి లాభాలు తెచ్చి పెట్టింది, ఇపుడు ఇండస్ట్రీ లో టాప్ ప్రొడ్యూసర్ గా నిలపడానికి ఈ సినిమా కూడా టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు.

ఈ సినిమాతో పరిచయం అయిన మరో అద్భుతమైన టెక్నిషియన్ ‘రత్నవేలు‘. ఈయన సినిమాటోగ్రఫీ వరల్డ్ క్లాస్ లెవెల్ లో ఉంటుంది. ప్రస్తుతం రజినీకాంత్, చిరంజీవి లాంటి పెద్ద హీరోల సినిమాలు చేస్తున్నాడంటే రత్నవేలు వర్క్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. వీరితో పాటు మరో తెలుగు సంగీత దర్శకుడు ఈ సినిమా ద్వారా టాప్ లెవెల్ కి రీచ్ అయ్యాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాతో టాప్ లీగ్ కి వెళ్లి తర్వాత సంవత్సరం లోనే చిరంజీవితో పని చేసే అవకాశం అందుకున్నాడు.

వీళ్ళకే కాదు ఇంకా ఎంతో మందికి ఇండస్ట్రీ లో మొదటి స్టేజ్ సక్సెస్ అందించి వాళ్ళందరి కెరీర్ లో మైలు రాయిగా ఈ సినిమా నిలిచింది. ఈ రోజు ఈ సినిమా విడుదలై 17 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సినిమా హీరో అల్లు అర్జున్ ఈ విషయాన్ని షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం దాదాపు ఇదే కాంబినేషన్ లో ‘పుష్ప’ సినిమా మరోసారి రికార్డు లు బ్రేక్ చేయడానికి సిద్ధం అవుతుంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular