fbpx
HomeMovie Newsఫిబ్రవరి 19 న 'నాంది' పలకనున్న అల్లరి నరేష్

ఫిబ్రవరి 19 న ‘నాంది’ పలకనున్న అల్లరి నరేష్

AllariNaresh NaandiMovie ReleaseDateAnnounced

టాలీవుడ్: ఈ ఏడాది ఆరంభం లో ‘బంగారు బొల్లోడు’ అనే కామెడీ ఎంటర్టైనర్ విడుదల చేసి ప్లాప్ చవి చూసాడు అల్లరి నరేష్. ఈ సారి తన రొటీన్ కామెడీ కథలు కాకుండా ఒక కొత్త రకమైన సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. అల్లరి నరేష్ ఒక ఖైదీ గా నటిస్తూ ‘నాంది’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఓటీటీ లో విడుదలవుతుంది అనే రూమర్ కి చెక్ పెడుతూ ఈ రోజు ఈ సినిమా విడుదల తేదీ ని ప్రకటించారు. ఫిబ్రవరి 19 న ఈ సినిమా విడుదల అవనున్నట్టు అల్లరి నరేష్ అధికారికంగా తెలిపారు.

అమాయకమైన వ్యక్తిని ఒక కేసు లో అరెస్ట్ చేసి ఆ తప్పుని ఒప్పుకొనేదాకా టార్చెర్ చేస్తూ ఉంటారు. అలా తనకి సంబంధం లేని ఒక విషయం లో జైలుకి వెళ్లి పోలీసుల చేత చిత్రవధలు అనుభవించే పాత్రలో నరేష్ ఒక ప్రయోగాత్మక రోల్ లో ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఒకానొక సీన్ లో నరేష్ న్యూడ్ గా నటించాడు. ఎస్.వీ.ఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శతమానం భవతి డైరెక్టర్ సతీష్ వేగేశ్న ఈ సినిమాని నిర్మించారు. విజయ్ కనకమేడల ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. నరేష్ కెరీర్ లో 57 వ సినిమా గా రూపొందుతున్న ఈ సినిమా నుండి అన్ని కొత్త దనం ఉండే సినిమాలే చేస్తానని నరేష్ ఒక వేడుకలో చెప్పాడు. చూద్దాం అల్లరి నరేష్ ఆ మాట మీద నిలబడతాడో మళ్ళీ అదే పాత పంథాలోకి వేళ్తాడో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular