fbpx
Saturday, April 27, 2024
HomeMovie Newsవిడుదల తేదీ ప్రకటించిన అక్కినేని 'బాచిలర్'

విడుదల తేదీ ప్రకటించిన అక్కినేని ‘బాచిలర్’

Akhil MostEligibleBachelor ReleaseDateAnnounced

టాలీవుడ్: అక్కినేని హీరో అఖిల్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్’. ఈ సినిమా విడుదల తేదీ కోసం అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సోలో రిలీజ్ కోసం ట్రై చేసి జూన్ లో ఎక్కువ రిలీజ్ లేని టైం చూసుకుని అఖిల్ జూన్ లో తన సినిమాని విడుదల చేస్తున్నాడు. ఈ సినిమాని జూన్ 19 న విడుదల చేయనున్నట్టు ఈరోజు అధికారికంగా ప్రకటించారు. చాలా రోజుల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ మెగా ఫోన్ పట్టుకుని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. లవ్ స్టోరీస్, ఫామిలీ ఎంటర్టైనర్ లు తీయడంలో నిపుణుడైన భాస్కర్ ఈ సినిమాని కూడా మంచి రొమాంటిక్ ఫామిలీ ఎంటర్టైనర్ లాగ రూపొందించాడని టీజర్, పోస్టర్లు చూస్తే తెలుస్తుంది.

ఈ సినిమాలో అఖిల్ కి జోడీ గా పూజ హెగ్డే నటిస్తుంది. GA2 పిక్చర్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. గోపి సుందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఇప్పటివరకైతే జూన్ మొదటి వారంలో సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ తప్ప మిగతా ఏ సినిమా కూడా జూన్ లో విడుదల తేదీ లు ప్రకటించలేదు. మున్ముందు ఏమైనా వస్తాయేమో చూడాలి. ఇప్పటికి 3 సినిమాలు చేసినా కూడా మంచి సక్సెస్ రుచి చూడని అఖిల్ ఈ సినిమాతో ఎలాగైనా ఒక సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. పోయిన సంవత్సరం ఏప్రిల్ లో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు విడుదలకి సిద్ధం అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular