fbpx
HomeMovie Newsఅజిత్ 'వాలిమై' ఫస్ట్ లుక్

అజిత్ ‘వాలిమై’ ఫస్ట్ లుక్

Ajith Valimai FirstLook

కోలీవుడ్: రజిని కాంత్, కమల్ హాసన్ తర్వాత తమిళ్ లో టాప్ రేంజ్ లో ఉన్న నటులు విజయ్ మరియు అజిత్. ప్రస్తుతం వరుస హిట్లు కొడుతూ టాప్ ఫార్మ్ లో ఉన్నాడు అజిత్. రీసెంట్ గా ‘పింక్’ సినిమా రీమేక్ ని ‘నేర్కొండ పార్వై’ అనే టైటిల్ తో రూపొందించి హిట్ కొట్టాడు. హెచ్ వినోత్ అనే దర్శకుడు ఈ సినిమాని బోనీ కపూర్ నిర్మాణంలో రూపొందించారు. ప్రస్తుతం ఇదే ప్రొడ్యూసర్, డైరెక్టర్ కాంబినేషన్ లో ‘వాలిమై’ అనే సినిమాలో నటిస్తున్నాడు అజిత్. ఈ సినిమా అప్ డేట్స్ గురించి ఫాన్స్ ఎన్నో రోజులుగా వేచి చూస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా అప్ డేట్స్ వాయిదా పడుతూ వస్తుంది.

ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. స్వతహాగా గా స్పోర్ట్స్ రేసింగ్ ఇష్టం ఉన్న అజిత్ కుమార్ ఈ సినిమాలో ఒక బైకర్ గా నటిస్తున్నాడు. ఈ రోజు విడుదల చేసిన లుక్ లో కూడా అదే స్పష్టం గా కనిపిస్తుంది. ఈ సినిమాలో హుమా ఖురేషి, అచ్యుత కుమార్, యోగి బాబు తదితరులు నటిస్తున్నారు. జీ స్టూడియోస్ మరియు బోణీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ‘పవర్ ఇస్ స్టేట్ అఫ్ మైండ్’ అంటూ ఈ సినిమా మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది సినిమా టీం. 2021 లోనే సినిమా విడుదల అవనున్నట్టు కూడా ఈ టీజర్ లో ధృవీకరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular