fbpx
HomeMovie Newsసత్యదేవ్ 'స్కైలాబ్' ఫస్ట్ లుక్

సత్యదేవ్ ‘స్కైలాబ్’ ఫస్ట్ లుక్

SkyLab Movie FirstLook

టాలీవుడ్: వైవిధ్యమైన సినిమాలు చేస్తూ సినిమా సినిమాకి తన ఇమేజ్ ని పెంచుకుంటూ మంచి కథలు, కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ ఎదుగుతున్నాడు సత్యదేవ్. మరి కొద్ది రోజుల్లో ‘తిమ్మరుసు’ అనే సినిమాతో పలకరించనున్న సత్యదేవ్ ఈ రోజు తాను నటిస్తున్న మరో కొత్త సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసాడు. 1970 ల్లో ‘స్కై ల్యాబ్’ అనే పేరు బాగా వినిపించింది. అంతరిక్షం నుండి స్కైలాబ్ ఒకటి భూమి మీద పడిందని చాలా వార్తలు ఉండేవి వాటి గురించి ఎవరికీ ఎక్కువగా తెలియదు. ఈ సినిమా పరిచయం కూడా పిల్లలందరికీ వాళ్ళ తల్లి తండ్రులు చెప్పని కథ అన్నట్టు పరిచయం చేసారు. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ సినిమాలో మరో రెండు ముఖ్య పాత్రల్లో నిత్య మీనన్, రాహుల్ రామకృష్ణ నటించారు.

ఫస్ట్ లుక్ లో ఒక సాటిలైట్ లాంటి ఆబ్జెక్ట్ పై కూర్చున్న సత్యదేవ్, నిత్య మీనన్, రాహుల్ రామకృష్ణ కనిపిస్తునారు. వీరితో పాటు ఆ సాటిలైట్ లాంటి ఆబ్జెక్ట్ పైన ‘బండ లింగంపల్లి’ అనే విలేజ్ సైన్ బోర్డు పెట్టి అదే ఆబ్జెక్ట్ పైన ఒక వైపు పశువులు, మరో వైపు వూరు జనాలు ఇలా ఒక విలేజ్ వాతావరణం ఆ శాటిలైట్ పైన చూపించారు. చూస్తుంటే ఒక ఎక్స్పెరిమెంటల్ కామెడీ సినిమా లాగ అనిపిస్తుంది. బైట్ ఫీచర్స్ మరియు నిత్య మీనన్ కంపెనీ సమర్పణలో పృథ్వీ పిన్నమరాజు ఈ సినిమాని నిర్మించారు. విశ్వక్ కందరావు అనే దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రశాంత్ విహారి సంగీతం లో ఈ సినిమా రూపొందనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular