fbpx
HomeAndhra Pradeshకరోనా బారిన పడ్డ సహజనటి జయసుధ!

కరోనా బారిన పడ్డ సహజనటి జయసుధ!

ACTOR-JAYASUDHA-TESTED-POSITIVE-AND-IN-HOME-ISOLATION

హైదరాబాద్: దేశంలో కరోనా మూడో వేవ్ ఇంకా కొనసాగుతోండి. ఈ వేవ్ లో భారత్ లో పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడి కోలుకున్నారు.

కాగా ఈ కరోనా వైరస్ మహమ్మారి తెలుగు సినీ ఇండస్ట్రీని ఇంకా వెంటాడుతూనే ఉంది. పలువురు మూవీ స్టార్స్‌ కరోనా బారిన పడుతూనే ఉన్నారు. కాగా ఇప్పుడు తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి, సహజనటి జయసుధ గారు కూడా ఇప్పుడు కరోనా బారిన పడ్డారు.

ఆమె ప్రస్తుతం కారోనా బారిన పడ్డాక హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా సహజ నటి జయసుధకి కరోనా అని తెలియగానే ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ అభిమానులు సహా నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular