fbpx
Monday, April 29, 2024
HomeMovie Newsవిశాల్ , ఆర్య కాంబినేషన్ లో సినిమా

విశాల్ , ఆర్య కాంబినేషన్ లో సినిమా

Another MultiStarrerMovieFrom VishalAndArya

కోలీవుడ్: కోలీవుడ్ హీరోలు విశాల్, ఆర్య కలిసి మరొక సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ సాధిస్తూ మంచి ఫామ్ లో ఉన్న విశాల్ ‘చక్ర’ అనే సినిమా పూర్తి చేసి మరొక సినిమా మొదలు పెట్టే పనిలో ఉన్నాడు. ఆ సినిమాలో మరో ఆసక్తి కరమైన పాత్రలో ఆర్య కూడా నటిస్తున్నాడు. ఇదివరకే విశాల్, ఆర్య కలిసి బాలా దర్శకత్వం లో ‘వాడు వీడు’ అనే సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇపుడు వీళ్లిద్దరు కలిసి నటించడం ఇది రెండవసారి. ఈ మధ్య కాలం లో ఆర్య సినిమాలు సరిగ్గా ఆడట్లేదు. ఈ సినిమా ద్వారా మళ్ళీ ఫామ్ లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈ సినిమాకి విజయ్ దేవరకొండ నటించిన ‘నోటా’ అలాగే విక్రమ్ నటించిన ‘ఇంకొక్కడు’ సినిమాలకి దర్శకత్వం వహించిన ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ డైరెక్టర్ అంత విజయవంతం అవనప్పటికీ కొంతవరకు ఇంకొక్కడు టెక్నికల్ గా అలాగే థ్రిల్లింగ్ ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఈ సినిమాలో మరొక క్యారెక్టర్ లో గద్దలకొండ గణేష్ లో నటించిన ‘మృణాళిని రవి‘ నటిస్తున్నట్టు సమాచారం కానీ ఎక్కడా అధికారిక ప్రకటన ఐతే ఏమీ లేదు. ఈ సినిమాని వినోద్ అనే తమిళ్ ప్రొడ్యూసర్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని డైరెక్టర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular