fbpx
HomeMovie Newsప్రైమ్ లో విడుదలవుతున్న ఆనంద్ దేవరకొండ సినిమా

ప్రైమ్ లో విడుదలవుతున్న ఆనంద్ దేవరకొండ సినిమా

MiddleClassMelodies Movie OnPrimeVideo

టాలీవుడ్: టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీ కి పరిచయం అయిన హీరో ‘ఆనంద్ దేవరకొండ’. 2019 లో రాజశేఖర్ కూతురు ‘శివాత్మిక’ తో కలిసి దొరసాని అనే సినిమా ద్వారా మొదటి అడుగు వేసాడు. సినిమా అంతగా జనాలలోకి చొచ్చుకు వెళ్ళలేదు. మొదటి సినిమా ఫలితం బెడిసికొట్టినా కూడా ఈ హీరో వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.

తన రెండవ సినిమాగా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ అనే సినిమా తీసాడు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ లో విడుదల అవబోతుంది. ఇందులో ఆనంద్ దేవరకొండ కి జోడీ గా 96 ఫేమ్ ‘వర్ష బొల్లమా’ నటిస్తుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వీ.ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. వినోద్ ఆనంతోజు అనే నూతన దర్శకుడు ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అవబోతున్నాడు. ఈ సినిమాని నవంబర్ 20 నుండి ఓటీటీ లో అందుబాటులో ఉండబోతోందని మేకర్స్ ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular