fbpx
Tuesday, April 23, 2024
HomeMovie Newsమరోసారి పెళ్లి సందడి చెయ్యబోతున్న దర్శకేంద్రుడు

మరోసారి పెళ్లి సందడి చెయ్యబోతున్న దర్శకేంద్రుడు

Ragavendrarao Pellisandadni Announcement

టాలీవుడ్: శతాధిక చిత్రాల దర్శకుడు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలు తీయడం తగ్గించారు. అయన గడచిన పది సంవత్సరాలలో రెండే సినిమాలు తీసాడు. అవి కూడా భక్తి రస చిత్రాలు. అయితే నిన్ననే ఇవాళ ఒక సినిమా ప్రకటించబోతున్నట్టు తెలిపారు. చెప్పినట్టుగానే ‘పెళ్లి సందడి’ – మళ్ళీ మొదలవబోతుంది అనే సినిమా చెయ్యతోబున్నట్టు ప్రకటించారు. ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోలందరితో సినిమాలు తీసిన దర్శకుడు ప్రస్తుతం చాలా గ్యాప్ తీసుకుని సినిమా ప్రకటించారు. ఈ సినిమాలో నటీనటులు ఎవరు అనేది త్వరలో ప్రకటిస్తానని చెప్పారు.

రాఘవేంద్రరావు ట్వీట్ చేస్తూ ఒక వీడియో కూడా పోస్ట్ చేసి టెక్నిషియన్స్ వివరాలు తెలియచేసారు. ఆ వీడియో కూడా మొత్తం సంగీతం ఇన్స్ట్రుమెంట్స్, పూల తో నిండిపోయింది. దీన్ని బట్టి అర్ధం అవుతుంది. ఇది కూడా మరొక రొమాంటిక్ మరియు మ్యూజిక్ ఓరియెంటెడ్ మూవీ అని. ఈ సినిమాని ఆర్.కె.ఫిలింస్ మరియు ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్స్ పై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి నిర్మించనున్నారు. రాఘవేంద్రరావు ఆస్థాన సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు. శివశక్తి దత్తా, చంద్రబోస్ లు ఈ సినిమా పాటలకు సాహిత్యాన్ని అందించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular